AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదేంది మావ..! రాధికా శరత్ కుమార్ చెల్లెలు కూడా హీరోయినా..!! బాలయ్యతో బ్లాక్ బస్టర్స్

హీరోయిన్ రాధిక శరత్ కుమార్. వెండితరెపై ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. తెలుగులో ఎక్కువగా మెగాస్టార్ చిరంజీవితో కలిసి అనేక హిట్స్ చేసింది. నటి రాధిక పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి చాలా మందికి తెలుసు. అయితే ఆమెకు సంబంధించిన ఒక విషయం చాలా మందికి తెలియదు. అదేంటంటే..

ఇదేంది మావ..! రాధికా శరత్ కుమార్ చెల్లెలు కూడా హీరోయినా..!! బాలయ్యతో బ్లాక్ బస్టర్స్
Radhika
Rajeev Rayala
|

Updated on: Feb 18, 2026 | 7:50 PM

Share

చాలా మంది హీరోయిన్స్ కొన్ని సినిమాలతోనే విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంటూ ఉంటారు. ఒకప్పుడు అలరించి ఆతర్వాత సహాయక పాత్రలతో మెప్పిస్తున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. ఒకప్పుడు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్ గా నటించి ఇప్పుడు సహాయక పాత్రల్లో నటిస్తున్న నటీమణి ఎవరో కాదు రాధికా శరత్ కుమార్. ఒకప్పుడు హీరోయిన్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు రాధికా. అలాగే మెగాస్టార్ చిరంజీవి రాధికా కాంబినేషన్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తెలుగుతో పాటు తమిళ్ లోనూ చాలా సినిమాలు చేశారు రాధికా. సినిమాలతో పాటు సీరియల్స్ లోనూ నటించి ఆకట్టుకున్నారు. యంగ్ హీరోహీరోయిన్లకు అమ్మగా, అత్తగా నటిస్తున్నారు. అంతేకాదు రాజకీయాల్లోనూ క్రీయాశీలకంగా వ్యవహరిస్తున్నారు.

ఇదిలా ఉంటే రాధికా శరత్ కుమార్ చెల్లి తెలుగు ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ అని మీకు తెలుసా.? అవును రాధికా శరత్ కుమార్ మాత్రమే కాదు ఆమె చెల్లి కూడా తెలుగులో హీరోయిన్ గా రాణించారు. ఆమె చేసిన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అలాగే ఆమె అందంతో, నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఆమె ఎవరో కాదు నిరోషా. సింధూర పువ్వు సినిమాతో కుర్రకారు హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకుంటి నటి నిరోషా రాధ. అప్పట్లో తన అందం, అభినయంతో అందరినీ మెస్మరైజ్ చేసిన ఈ బ్యూటీ మరెవరో కాదు స్టార్ హీరోయిన్ రాధిక చెల్లెలు.

ఇవి కూడా చదవండి

కోలీవుడ్ ప్రముఖ నటుడు ఎం.ఆర్. రాధా కూతురు కూడా. రాధికా సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా స్టేటస్ సొంతం చేసుకన్నాక నిరోషా వెండితెరకు పరిచయమైంది. అగ్ని నక్షత్రం ఆమె మొదటి సినిమా. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన ఈ సినిమా తెలుగులో ఘర్షణ పేరుతో రిలీజ్ అయ్యింది. తెలుగులో నిరోషా.. ముద్దుల మావయ్య, నారీ నారీ నడుమ మురారి, స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్ ,కొబ్బరి బోండాం, డిటెక్టివ్ నారద,అత్తింట్లో అద్దె మొగుడు, ముగ్గురు అత్తల ముద్దుల అల్లుడు, అసాధ్యుడు, వన్ బై టూ, భలే ఖైదీలు, ఒక ఊరిలో, నువ్వు తోపురా తదితర సినిమాల్లో నటించి మెప్పించింది. బాలకృష్ణ, చిరంజీవి, రాజేంద్ర ప్రసాద్, వినోద్ కుమార్ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. సింధూరపువ్వు సినిమాలో తనతో కలిసి నటించిన హీరో రాంకీనే ప్రేమించి పెళ్లాడింది నిరోషా. పెళ్లి తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న ఆమె అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లోనూ యాక్ట్ చేస్తోంది. అలాగే తెలుగులో కొన్ని సీరియల్స్ లోనూ నటించింది. సుడిగుండాలు, మనసు గీసిన బొమ్మ, నందిని, ఇది కథ కాదు, జనని, మనసా కవ్వించకే, తల్లి ప్రేమ, కథ కాని కథ, మావి డాకులు తదితర సీరియల్స్ తో తెలుగు బుల్లితెర ఆడియెన్స్ కు చేరువైందీ అందాల తార.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us