AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉదయ్ కిరణ్ భార్య ఇప్పుడు ఎలా ఉందో.? ఏం చేస్తుందో తెలుసా.?

సినిమా ప్రపంచంలో కొంతమంది హీరోలు ఊహించని విధంగా ఓవర్ నైట్ లో స్టార్ డమ్ తెచ్చుకుంటారు. ఎన్ని సినిమాలు చేసినా రాని స్టార్ డమ్ ఒకేఒక్క సినిమాతో తెచ్చుకున్నారు కొందరు యంగ్ హీరోలు. మరి కొంతమంది వరుసగా సినిమాలు చేస్తూ.. క్రమక్రమంగా హీరోలుగా ఎదుగుతారు. ఎవరు ఎలా క్రేజ్ తెచుకున్నప్పటికీ ఆ స్టార్ డమ్ ను కంటిన్యూ చేయకపోతే ప్రేక్షకులు ఇట్టే మర్చిపోతారు.

ఉదయ్ కిరణ్ భార్య ఇప్పుడు ఎలా ఉందో.? ఏం చేస్తుందో తెలుసా.?
Uday Kiran
Rajeev Rayala
|

Updated on: Feb 15, 2026 | 5:50 PM

Share

ఎంతోమంది హీరోలు తెలుగులో సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. యంగ్ హీరోలు కొత్త కొత్త సినిమాలతో రాణిస్తున్నారు. కొంతమంది హీరోలు. అయితే ఒకప్పుడు స్టార్ హీరోలు అవుతారు అనుకున్న వారు ఊహించని ఫ్లాప్ లతో కనిపించకుండా పోయారు. కథల ఎంపికలో తప్పటడుగు వేయడంలోనో.. లేక మరో కారణంతోనో చాలా మంది హీరోల సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఉదయ్ కిరణ్ కెరీర్ కూడా అలానే జరిగింది. తక్కువ సమయంలో స్టార్ హీరోగా ఎదిగాడు ఉదయ్ కిరణ్. తేజ దర్శకత్వంలో 2000 సంవత్సరంలో వచ్చిన చిత్రం అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు ఈ  హీరో. తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సొంతం చేసుకున్నాడు ఉదయ్ కిరణ్..

అప్పుడు అంట్లు తోమింది.. కట్ చేస్తే నటిగా సూపర్ క్రేజ్.. రాజకీయాల్లోనూ తోపు ఈమె

తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకొని అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు ఉదయ్ కిరణ్. తేజ దర్శకత్వం వహించిన చిత్రం సినిమా తర్వాత నువ్వు నేను, మనసంతా నువ్వే, కలుసుకోవాలని, శ్రీరామ్, హోలీ, నీ స్నేహం లాంటి సినిమాలతో వరుస విజయాలను అందుకున్నాడు ఉదయ్ కిరణ్. అదే సమయంలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు ఉదయ్. అయితే ఊహించని విధంగా ఉదయ్ సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతూ వచ్చాయి. వరుసగా ఫ్లాప్స్ రావడంతో ఉదయ్ కిరణ్ డైలమాలో పడ్డారు. తెలుగులోనే కాదు తమిళ్ లోనూ సినిమా చేసి అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. అక్కడ పోయి అనే సినిమాతో తమిళ్ ఇండస్ట్రీలోకి కూడా అడుగు పెట్టాడు ఉదయ్ కిరణ్.

నాకు పెళ్లయింది అని చెప్పా.. ఆ సినిమా ఛాన్స్ మిస్ అయ్యింది..! షాకింగ్ విషయం చెప్పిన బిగ్ బాస్ బ్యూటీ

అయితే వరుస ఫ్లాప్ లు రావడంతో ఉదయ్ కిరణ్ కెరీర్ ఆందోళల్లో పడింది. చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో ఆయనకు అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. ఆ తర్వాత ఉదయ్ కిరణ్ విషిత‌ను వివాహం చేసుకున్నాడు. ,వీరి వివాహం గ్రాండ్ గా జరిగింది. సినీ సెలబ్రెటీలు కూడా వీరి వివాహానికి హాజరయ్యారు. పెళ్లి తర్వాత ఈ ఇద్దరూ చాలా సంతోషంగా గడిపారు. పెళ్లి తర్వాత ఆయనకు అవకాశాలు తగ్గడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఉదయ్. భార్య జాబ్ చేస్తుండటంతో ఆయన ఇంట్లో ఖాళీగా ఉండే పరిస్థితి ఏర్పడింది. చివరకు ఆయన మనస్తాపంతో ఆత్మహత్య చేసుకొని కన్నుమూశారు. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు ఉదయ్. ఆయన మరణంతో ఫ్యాన్స్ ఆందోళనకు గురయ్యారు. ఇప్పటికి ఆయన ఫ్యాన్స్ ఉదయ్ ను మిస్ అవుతున్నారు. అయితే ఉదయ్ కిరణ్ భార్య విషిత ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..? ఆమె ఇప్పుడు ఎక్కడ ఉన్నారు.? ఏం చేస్తున్నారాని కొందరు నెటిజన్స్ ఆరా తీస్తున్నారు. విషిత ఇప్పుడు సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తుంది. ఉదయ్ కిరణ్ మరణం తర్వాత ఆమె మరో వివాహం చేసుకోలేదు. జాబ్ చేసుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తున్నారు విషిత.

ఇవి కూడా చదవండి

ఇప్పటికీ మిస్ అవుతున్నాం.! ఈ సినిమాలో నటించిన ఆరుగురు ఇప్పుడు మనతో లేరు..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి