డార్లింగ్ ఇదెప్పుడు చేశాడు..! పుట్టింది పడుకోడానికి కాదు బే.. అంటూ ప్రభాస్ ఇన్ స్టా రీల్
రెబల్ స్టార్ ప్రభాస్ లైనప్ చేసిన సినిమాలు చేస్తుంటే మెంటలెక్కుతుందిగా.. గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నాడు ప్రభాస్. సలార్, కల్కి సినిమాలు ఇచ్చిన హిట్ తో ప్రభాస్ స్పీడ్ పెంచేశాడు. ఇటీవలే రాజా సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది.

పాన్ ఇండియా హీరో, రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. బాహుబలి సినిమాలంటే ముందు ప్రభాస్ టాలీవుడ్ టాప్ హీరో.. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. పాన్ ఇండియా స్టార్ అయ్యిపోయాడు. విదేశాల్లోనూ ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్నాడు. జపాన్ లాంటి దేశంలో ప్రభాస్ కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక బాలీవుడ్ లో ప్రభాస్ సినిమాలకు సపరేట్ క్రేజ్ ఏర్పడింది. సాహో సినిమా అక్కడ భారీ వసూళ్లను సాధించింది. ప్రభాస్ సలార్, కల్కి సినిమాలతో సంచలన విజయాలను అందుకున్నాడు. ఇటీవలే రాజా సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా భారీ అంచనాలు మధ్య విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
అప్పుడు అంట్లు తోమింది.. కట్ చేస్తే నటిగా సూపర్ క్రేజ్.. రాజకీయాల్లోనూ తోపు ఈమె
ఇదిలా ఉంటే ప్రభాస్ ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. తన సినిమాకు సంబందించిన విశేషాలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నాడు డార్లింగ్. ఇదిలా ఉంటే ప్రభాస్ ఇన్ స్టా గ్రామ్ లో రీల్ చేసిన విషయం ఎవరికైనా తెలుసా.? అవును ప్రభాస్ కూడా ఇన్ స్టాలో ఓ రీల్ చేశాడు. వేరే హీరో డైలాగ్ కు వీడియో చేశాడు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రభాస్ కు పూరిజగన్నాథ్ ఫ్యామిలీకి మంచి అనుబంధం ఉన్న విషయంతెలిసిందే.
నాకు పెళ్లయింది అని చెప్పా.. ఆ సినిమా ఛాన్స్ మిస్ అయ్యింది..! షాకింగ్ విషయం చెప్పిన బిగ్ బాస్ బ్యూటీ
పూరిజగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి ప్రభాస్ తో చాలా క్లోజ్ గా ఉంటాడు. ఆ మధ్య ఆకాష్ నటించిన రొమాంటిక్ సినిమా కోసం ప్రభాస్ హీరో, హీరోయిన్ ను ఇంటర్వ్యూ చేశాడు. ఆ తర్వాత రొమాంటిక్ సినిమాలోని ఓ డైలాగ్ ను ఆకాష్ తో కలిసి రీల్ చేశాడు ప్రభాస్. “పుట్టింది పడుకోడానికి కాదు బే.. పోయాక పాడుకోరా ఎవడడిగాడు” అనే డైలాగ్ ను రీల్ చేశాడు ప్రభాస్. ఈ వీడియో సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతుంది. అన్న చేసిన ఫస్ట్ రీల్ అంటూ అభిమానులు ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ వీడియోకు డార్లింగ్ ఫ్యాన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.
ఇప్పటికీ మిస్ అవుతున్నాం.! ఈ సినిమాలో నటించిన ఆరుగురు ఇప్పుడు మనతో లేరు..
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
