నాకు పెళ్లయింది అని చెప్పా.. ఆ సినిమా ఛాన్స్ మిస్ అయ్యింది..! షాకింగ్ విషయం చెప్పిన బిగ్ బాస్ బ్యూటీ
సినిమాల్లో ఛాన్స్ రావడం అనేది చాలా కష్టం. ముఖ్యంగా హీరోయిన్స్ కు.. ఒక్కసారి అవకాశం వచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడం కూడా చాలా కష్టం. అయితే ఓ ముద్దుగుమ్మకు పెళ్లయిందని చెప్పగానే ఓ సినిమా ఛాన్స్ చేజారిపోయిందట.. ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.?

బిగ్ బాస్ గేమ్ షో ద్వారా పాపులర్ అయినా వారు ఇప్పుడు చాలా ఇప్పుడు సినిమాలు, టీవీ షోలు చేస్తూ దూసుకుపోతున్నారు. కొంతమంది బిగ్ బాస్ గేమ్ షోకు వచ్చే వరకు వాళ్లు ఎవరో చాలా మందికి తెలియదు. బిగ్ బాస్ తరువాత పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఇక ఇప్పుడు ఓ అందాల భామ బిగ్ బాస్ తర్వాత ఫుల్ బిజీగా మారిపోయింది. యాంకర్ గా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. టీవీ షోలు, సినిమా ఈవెంట్స్ తో తీరిక లేకుండా గడుపుతుంది. ఇక ఇప్పుడు సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. పెళ్లయిందని చెప్పగానే ఆ తాను నటిస్తున్న సినిమా ఆగిపోయిందని తెలిపింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?
ప్రేమించి పెళ్లాడింది.. కట్ చేస్తే 16రోజులకే విడాకులు.. ఈ బ్యూటీ ఎవరో తెలుసా.?
బిగ్ బాస్ ద్వారా పాపులర్ అయిన వారిలో స్రవంతి చొక్కారపు ఒకరు. ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ కు వెళ్ళాక ముందు యాంకర్ గా చేసింది. పలు ఛానెల్స్ లో యాంకర్ గా చేసింది. ఆతర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టింది. బిగ్ బాస్ లో తన గేమ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత యాంకర్ గా బిజీగా మారిపోయింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అందాలతో నెటిజన్స్ ను కవ్వించింది. ఇక ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.
కమిట్మెంట్‌కు నో చెప్పా.. పెద్ద సినిమా ఆఫర్స్ పోయాయి.. పొలిమేర బ్యూటీ షాకింగ్ కామెంట్స్
హి భగవాన్ అనే సినిమాలో నటిస్తుంది స్రవంతి. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఆమెకు పెళ్లి కాకముందు ఒక ప్రముఖ తమిళ నటుడి కుమారుడి తొలి చిత్రంలో ప్రధాన పాత్ర పోషించే అవకాశం వచ్చిందని తెలిపింది. అందుకోసం స్క్రీన్ టెస్ట్ నిర్వహించి, హీరో పక్కన నిల్చొని ఫోటోలు కూడా తీశారు. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. హీరోయిన్ గా ఫిక్స్ చేశారు. మరుసటి రోజు చెన్నై వెళ్లి షూటింగ్‌లో పాల్గొనాలని, అక్కడికి వచ్చి అడ్వాన్స్ తీసుకోవాలని చెప్పారు. అయితే, చెన్నై బయలుదేరే ముందు, స్రవంతి ఆ సినిమా మేనేజర్‌తో మాటల్లో మాటగా తనకు పెళ్లి అయిందని చెప్పిందట. దాంతో ఆ మేనేజర్, ఒక గంటలో మీకు కాల్ చేస్తానని చెప్పాడట.. అంతే ఆతర్వాత కాల్ లేదు ఆ సినిమా కూడా లేదట. పెళ్లయిందని చెప్పడంతో ఆ అవకాశాన్ని కోల్పోయా అని తెలిపింది. అంతేకాకుండా, ఆ సినిమా కూడా అడిగిపోయిందని తెలిపింది స్రవంతి.
నువ్వు గ్రేట్ భయ్యా..! రోడ్డుమీద పడున్న పెద్దాయనను కాపాడిన శ్రీహాన్.. అభిమానుల ప్రశంసలు
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




