AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కృతిశెట్టి కాదు, అనస్వర రాజన్ కాదు.. మెగాస్టార్ కూతురిగా ఈ బ్యూటీ ఫిక్స్ అంటున్నారుగా..

ఈ ఏడాది ప్రారంభంలోనే బ్లాక్ బస్టర్ హిట్టు అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. సంక్రాంతి పండగ సందర్భంగా విడుదలైన మన శంకరవరప్రసాద్ గారు మూవీ భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి నటించిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాకు అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

కృతిశెట్టి కాదు, అనస్వర రాజన్ కాదు.. మెగాస్టార్ కూతురిగా ఈ బ్యూటీ ఫిక్స్ అంటున్నారుగా..
Chiranjeevi
Rajeev Rayala
|

Updated on: Feb 16, 2026 | 2:14 PM

Share

మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో భారీ హిట్ అందుకున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో చిరంజీవి తన వింటేజ్ లుక్ తో ఆకట్టుకున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. చాలా కాలం తర్వాత చిరంజీవి వింటేజ్ లుక్ తో పాటు తన కామెడీతోనూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఇప్పుడు చిరంజీవి నెక్ట్స్ సినిమా పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే మెగాస్టార్ లైనప్ చేసిన సినిమాల్లో విశ్వంభర సినిమా ఒకటి. వశిష్ఠ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

ఓయమ్మో..! కుష్బూ కూతురు అందం ముందు స్టార్ హీరోయిన్స్ కూడా పనికిరారు.. త్వరలోనే ఎంట్రీ

నిజానికి ఈ సినిమా మన శంకరవరప్రసాద్ గారు సినిమాకంటే ముందే విశ్వంభర రావాల్సి ఉంది.. కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో ఆ సినిమా ముందు విడుదలైంది. ఇక విశ్వంభర సినిమా తర్వాత చిరంజీవి బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఇద్దరి కాంబినేషన్ లో వాల్తేరు వీరయ్య అనే సినిమా వచ్చింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు మరోసారి బాబీతో కలిసి చిరంజీవి సినిమా చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

సినిమా సెట్‌లో ఆ హీరోని నిజంగానే కొట్టా..! షాకింగ్ విషయం చెప్పిన నటుడు

ఇదిలా ఉంటే ఈ సినిమాలో మెగాస్టార్ కూతురిగా ఓ హీరోయిన్ నటిస్తుందని గతకొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ముందుగా చిరంజీవి కూతురిగా యంగ్ బ్యూటీ కృతిశెట్టి నటిస్తుందని వార్తలు వచ్చాయి. ఆతర్వాత ఛాంపియన్ మూవీ హీరోయిన్ అనస్వర రాజన్ నటిస్తుందని టాక్ వినిపిస్తుంది. ఈ అమ్మడు దాదాపు కన్ఫర్మ్ అన్నారు. కానీ ఇప్పుడు మరో యంగ్ హీరోయిన్ పేరు వినిపిస్తుంది. కన్నప్ప సినిమాతో ప్రేక్షకులను అలరించిన హీరోయిన్ ప్రీతీ ముకుందన్ మెగాస్టార్ కూతురిగా నటిస్తుందని టాక్ వినిపిస్తుంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది. మెగాస్టార్ సినిమాతో ఈ చిన్నదాని క్రేజ్ మరింత పెరగడం ఖాయం.

చదివింది 4వ తరగతి..! 14ఏళ్లకే పెళ్లి.. 450కి పైగా సినిమాలు..!! స్టార్ హీరోలకు చమట్లు పట్టించింది

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us