AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సినిమా సెట్‌లో ఆ హీరోని నిజంగానే కొట్టా..! షాకింగ్ విషయం చెప్పిన నటుడు

సినిమాల్లో ఎంతో మంది నటీనటులు తమ నటనతో ప్రేక్షుకులను విశేషంగా ఆకట్టుకున్నారు. అలాంటి వారిలో సీవీఎల్ నరసింహరావు ఒకరు. ఎన్నో విద్యమైన పాత్రల్లో నటించి మెప్పించారు. తన నటనతో పాటు కామెడీ సీన్స్ లోనూ కనిపించి ఆకట్టుకున్నారు సీవీఎల్ నరసింహరావు .

సినిమా సెట్‌లో ఆ హీరోని నిజంగానే కొట్టా..! షాకింగ్ విషయం చెప్పిన నటుడు
Cvl Narasimha Rao
Rajeev Rayala
|

Updated on: Feb 15, 2026 | 6:39 PM

Share

ఎన్నో సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించారు నటుడు, లాయర్ సీవీఎల్ నరసింహారావు. హీరో, హీరోయిన్స్ తండ్రి పాత్రలో నటిస్తూ ఆకట్టుకుంటున్నారు సీవీఎల్ నరసింహారావు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సిటీ దర్బార్ అనే టాక్ షోలో తాను వందకు పైగా ఎపిసోడ్‌లు చేశానని, గద్దర్, శివసాగర్, వరవరరావు, వెంకయ్యనాయుడు వంటి వివిధ రంగాల ప్రముఖులను ఇంటర్వ్యూ చేశానని తెలిపారు. గద్దర్‌ను ప్రశ్నించిన సందర్భంలో నక్సలైట్ల నుంచి కిడ్నాప్ బెదిరింపులు ఎదురయ్యాయని, తన ప్రశ్నలు వారిని ఇబ్బంది పెట్టాయని తెలిపారు లాయర్ సీవీఎల్ నరసింహారావు.

అప్పుడు అంట్లు తోమింది.. కట్ చేస్తే నటిగా సూపర్ క్రేజ్.. రాజకీయాల్లోనూ తోపు ఈమె

అలాగే ఆయన మాట్లాడుతూ.. పబ్లిక్ లైఫ్‌లో ఉండాలనుకున్నవాళ్ళకి ప్రైవేట్ లైఫ్ ఉండాలనుకోవడం మూర్ఖత్వం, అని అన్నారు. దీనికి ఉదాహరణగా ప్రముఖ రచయిత మల్లాది వెంకటకృష్ణమూర్తి ఫోటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన ఘటనను ప్రస్తావించారు. మల్లాది లాంటి వ్యక్తిని తాను సన్మానించినప్పుడు తీసిన ఫోటో సంచలనం సృష్టించిందని, ఆయన అభిమానులు ఆయన్ను మొదటిసారి చూడటం పట్ల ఆనందం వ్యక్తం చేశారని, అయితే మల్లాది మాత్రం తాను బతికుండగానే చంపేశాడని భయపడ్డారని తెలిపారు.

నాకు పెళ్లయింది అని చెప్పా.. ఆ సినిమా ఛాన్స్ మిస్ అయ్యింది..! షాకింగ్ విషయం చెప్పిన బిగ్ బాస్ బ్యూటీ

అలాగే సినిమాల గురించి మాట్లాడుతూ.. వెంకీ సినిమాలో స్నేహతో తనకు క్లాష్ వచ్చిందని వస్తున్న రూమర్‌ను నరసింహారావు ఖండించారు. ట్రైన్‌లో రవితేజను కొట్టే సన్నివేశంలో, నాటకరంగంలో అలవాటు పడిన పద్ధతిలో గట్టిగా కొట్టానని, సినిమా కెమెరా యాంగిల్స్, లైటింగ్ టెక్నిక్స్ గురించి అవగాహన లేకపోవడం వల్ల ఇది జరిగిందని అన్నారు సీవీఎల్. డైరెక్టర్, రైటర్ ఆలోచనలకు అనుగుణంగా నటించడమే తన పని అని, పాత్రలో 40-50 శాతం న్యాయం చేస్తే చాలని భావిస్తానని అన్నారు.

ఇవి కూడా చదవండి

ఇప్పటికీ మిస్ అవుతున్నాం.! ఈ సినిమాలో నటించిన ఆరుగురు ఇప్పుడు మనతో లేరు..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి