AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐఎమ్‌డీబీలో 9.4 రేటింగ్.. ఓటీటీలో దుమ్మురేపుతున్న లవ్ స్టోరీ.. క్లైమాక్స్ ట్విస్ట్ అదుర్స్

ఓటీటీల్లో సినిమాలకు ఉండే క్రేజ్ వేరు.. థియేటర్స్ లో విడుదలైన సినిమాలను మరోసారి ఓటీటీల్లో చూడటానికి ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. తెలుగు సినిమాలతో పాటు డబ్బింగ్ సినిమాలకు కూడా మంచి క్రేజ్ ఉంటుంది. అలాగే లవ్ స్టోరీలు ప్రేక్షుకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

ఐఎమ్‌డీబీలో 9.4 రేటింగ్.. ఓటీటీలో దుమ్మురేపుతున్న లవ్ స్టోరీ.. క్లైమాక్స్ ట్విస్ట్ అదుర్స్
Ott Movie
Rajeev Rayala
|

Updated on: Feb 15, 2026 | 7:14 PM

Share

రీసెంట్ డేస్ లో చిన్న సినిమా పెద్ద సినిమాని తేడా లేకుండా అన్ని సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ మధ్యకాలంలో అందమైన ప్రేమకథ చిత్రాలు మంచి విజయాలను అందుకుంటున్నారు. రాజు వెడ్స్ రాంబాయి, మొన్నీమధ్యనే వచ్చిన సిరాయి సినిమాలు ప్రేక్షకుల హృదయాలను టచ్ చేశాయి. థియేటర్స్ తో పాటు ఓటీటీల్లోనూ ప్రేమకథ సినిమాలు, వెబ్ సిరీస్ లకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. యూత్ కు ఆకట్టుకునేలా కొంచెం కొత్తగా ఉండాలే కానీ ఈ లవ్ స్టోరీలకు ఊహించని రెస్పాన్స్ వస్తుంటుంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి వందల కోట్లు కొల్లగొట్టిన సినిమాలు చాలానే ఉన్నాయి మనదగ్గర చాలానే ఉన్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడ ఒక స్వచ్ఛమైన ప్రేమకథా చిత్రమే.

అప్పుడు అంట్లు తోమింది.. కట్ చేస్తే నటిగా సూపర్ క్రేజ్.. రాజకీయాల్లోనూ తోపు ఈమె

ఇటీవలే థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. యువతతో పాటు అన్ని వర్గాల ఆడియెన్స్ ను అలరించింది. విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. అద్భుతమైన కథా కథనాలు, హీరో, హీరోయిన్ల పెర్ఫామెన్స్, సినిమాటోగ్రఫీ, మెలోడియస్ సౌండ్‌ట్రాక్, అందమైన గ్రామీణ దృశ్యాలు ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. ఐఎమ్ డీబీలో 9.4/10 రేటింగ్‌తో ఈ సినిమా దూసుకుపోతోంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. మహారాష్ట్రలో ఒక గ్రామీణ ప్రాంతంలో గోల్యా, ప్రార్థనల తిరుగుతుంది. గోల్యా ఒక సాధారణ యువకుడు. స్థానికంగా ప్రార్థన అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఆమె కూడా గోల్యా ప్రేమను అంగీకరిస్తుది. అయితే బ్రిటిష్ పాలకుల నిరంకుశత్వం, గ్రామంలోని సామాజిక దురాచారాలు వీరి స్వచ్ఛమైన ప్రేమకు అడ్డంకిగా నిలుస్తాయి.

నాకు పెళ్లయింది అని చెప్పా.. ఆ సినిమా ఛాన్స్ మిస్ అయ్యింది..! షాకింగ్ విషయం చెప్పిన బిగ్ బాస్ బ్యూటీ

ముఖ్యంగా అదే గ్రామంలో ఉండే ఉపేంద్ర గోల్యా, ప్రార్థనల ప్రేమకు శత్రువుగా మారతాడు. తన అధికారాన్ని, పలుకుబడిని ఉపయోగించి వారిని విడగొట్టాలని ప్రయత్నిస్తాడు. బ్రిటిష్ వారితో కలిసి గోల్యా, ప్రార్థనలకు సమస్యలు సృష్టిస్తాడు. మరి చివరకు ఈ ప్రేమకథ ఏమైంది? గోల్యా, ప్రార్థనలు ఒక్కటయ్యారా.? అన్న ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే. క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం ఎంతో ఎమోషనల్ గా ఉంటుంది. ఈ సినిమా పేరు మాఝీ ప్రార్థన. థియేటర్లలో విడుదలైన ఈ మరాఠీ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ మంచి విజయాన్ని సాధించింది. ఇక ఈ సినిమాలో పద్మరాజ్ రాజ్‌గోపాల్ నాయర్ (గోల్యా), అనుషా అడెప్ (ప్రార్థన), ఉపేంద్ర లిమాయే, జైనేంద్ర నికలే తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. మహారాష్ట్రలో ఒక గ్రామీణ ప్రాంతం నేపథ్యంలో సాగే ఓటీటీలో ఆకట్టుకుంటుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు జీ5, జియో హాట్ స్టార్ వద్ద ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

ఇప్పటికీ మిస్ అవుతున్నాం.! ఈ సినిమాలో నటించిన ఆరుగురు ఇప్పుడు మనతో లేరు..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us