AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చదివింది 4వ తరగతి..! 14ఏళ్లకే పెళ్లి.. 450కి పైగా సినిమాలు..!! స్టార్ హీరోలకు చమట్లు పట్టించింది

హీరోలతో పోల్చుకుంటే సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ చాలా తక్కువగా ఉంటుంది. వరుసగా రెండు, మూడు ఫ్లాప్ లు పడితే చాలు అవకాశాలు కరువైపోతాయి. ఇక హీరోయిన్లు పెళ్లి చేసుకుంటే కూడా సినిమా అవకాశాలు తగ్గుతాయన్న అభిప్రాయమూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ వందల కొద్దీ సినిమాలు చేసిన అందాల తారలు చాలా మందే ఉన్నారు.

చదివింది 4వ తరగతి..! 14ఏళ్లకే పెళ్లి.. 450కి పైగా సినిమాలు..!! స్టార్ హీరోలకు చమట్లు పట్టించింది
Tollywood Actress
Rajeev Rayala
|

Updated on: Feb 15, 2026 | 4:51 PM

Share

చాలా మంది హీరోయిన్స్ హీరోలతో సమానంగా క్రేజ్ సొంతం చేసుకున్నారు. హీరోలకు ఏ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సొంతం చేసుకుంటున్నారు. తమ నటనతో పాటు అందంతోనూ మెప్పించి ఆకట్టుకుంటున్నారు హీరోయిన్స్. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తుంది.. దాంతో హీరోలతో పాటు హీరోయిన్స్ కూడా రెమ్యునరేషన్ భారీగా అందుకుంటున్నారు. ఇప్పుడే కాదు ఒకప్పుడు కూడా హీరోయిన్స్ హీరోలతో పోటీపడి నటించారు. స్టార్ హీరోలు కూడా బిత్తరపోయేలా చేశారు. కాగా ఓ హీరోయిన్ దెబ్బకు స్టార్ హీరోలు కూడా షాక్ అయ్యారు. ఆమె క్రేజ్ చేసి , ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి అవాక్ అయ్యేవారు. హీరోలతో పోల్చుకుంటే సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ చాలా తక్కువగా ఉంటుంది. వరుసగా రెండు, మూడు ఫ్లాప్ లు పడితే చాలు అవకాశాలు కరువైపోతాయి. కానీ ఈ అమ్మడు మాత్రం ఇండస్ట్రీలో ఉన్నంత కాలం చక్రం తిప్పింది. అందం, అభినయంతో ఆమె తోపు ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?

అప్పుడు అంట్లు తోమింది.. కట్ చేస్తే నటిగా సూపర్ క్రేజ్.. రాజకీయాల్లోనూ తోపు ఈమె

ఏపీలోని ఓ పేద కుటుంబంలో ఈ ముద్దుగుమ్మ జన్మించింది. ఆర్థిక ఇబ్బందులతో నాలుగో తరగతితోనే చదువు మానేసింది. ఆ తర్వాత తల్లిదండ్రులు 14వ ఏటనే బలవంతంగా పెళ్లి చేశారు. చిన్నతనంలోనే భర్త హింస తట్టుకోలేక వదిలేసింది. ఆ తర్వాత చెన్నై వెళ్లింది. సినిమా అవకాశాల కోసం కాళ్లరిగేలా తిరిగింది. పొట్ట కూటి కోసం మేకప్ ఆర్టిస్ట్‌గా పని చేసింది. అలా తనకున్న పరిచయాలతోనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. కట్ చేస్తే.. సినిమా కెరీర్‌లో మొత్తం 450కి పైగా సినిమాల్లో నటించి సంచలనం సృష్టించింది. దక్షిణాదిన అన్ని భాషల్లోనూ నటించిన ఈ అందాల తార స్టార్ హీరోలందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది.

నాకు పెళ్లయింది అని చెప్పా.. ఆ సినిమా ఛాన్స్ మిస్ అయ్యింది..! షాకింగ్ విషయం చెప్పిన బిగ్ బాస్ బ్యూటీ

తన అందం, అభినయంతో కుర్రకారుకు ఫేవరెట్ గా మారిపోయింది. తన డిమాండ్, క్రేజ్ కు తగ్గట్టుగానే లక్షల్లో రెమ్యునరేషన్ అందుకుంది. ఒకానొక దశలో దక్షిణాదిలో అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా గుర్తింపు తెచ్చుకుంది. పెద్ద పెద్ద స్టార్ హీరోలు కూడా ఆమె క్రేజ్ ను చూసి షాక్ అయ్యారు. సినిమాల్లో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ఈ అందాల తార వ్యక్తిగత జీవితంలో మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. ప్రేమలో వైఫల్యం, ఇతరులు చేసిన మోసాలతో బాగా కుంగిపోయింది. స్టార్ నటిగా గుర్తింపు ఉన్నా ఇండస్ట్రీలో ఒంటరిగా మిగిలిపోయింది. చివరకు తన ఇంట్లోనే అనుమానాస్పద రీతిలో కన్నుమూసింది. అప్పటికాంకా ఆమె వయసు కేవలం 35 ఏళ్లే. హీరోయిన్‌గా నటించకపోయినా అంతకు మించి ఫాలోయింగ్ తెచ్చుకుంది సిల్క్ స్మిత. గ్లామర్ రోల్స్, బోల్డ్ సీన్లు, స్పెషల్ సాంగ్స్‌లో నటిస్తూ దక్షిణాదిన స్టార్ యాక్ట్రెస్ గా గుర్తింపు తెచ్చుకుంది.

ఇవి కూడా చదవండి

ఇప్పటికీ మిస్ అవుతున్నాం.! ఈ సినిమాలో నటించిన ఆరుగురు ఇప్పుడు మనతో లేరు..

Silk Smitha

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us