AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అతన్ని ఎనిమిదేళ్లు ప్రేమిస్తే.. మోసం చేశాడు..! ట్రాన్స్‌గా బ్రతకడం చాలా కష్టమంటున్న జబర్దస్త్ తన్మయి

ప్రేక్షకులను ఆకట్టుకున్న టీవీ షోలు చాలా ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకునే షో పేరు జబర్దస్త్. సినిమాలకు మించి ఈ టీవీ షో పాపులర్ అయ్యింది. కామెడీ స్కిట్స్ ప్రేక్షకులను తెగ నవ్వించాయి. ఇక జబర్దస్త్ ద్వారా చాలా మంది కమెడియన్స్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. కొంతమంది హీరోలుగా సినిమాలు చేస్తున్నారు.

అతన్ని ఎనిమిదేళ్లు ప్రేమిస్తే.. మోసం చేశాడు..! ట్రాన్స్‌గా బ్రతకడం చాలా కష్టమంటున్న జబర్దస్త్ తన్మయి
Jabardasth Tanmay
Rajeev Rayala
|

Updated on: Feb 18, 2026 | 8:42 PM

Share

ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన షోల్లో జబర్దస్త్ ముందు వరసలో ఉండేది.. ఈ కామెడీ షోకు విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ షో ద్వారా ఎంతో మంది నటీనటులు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. కమెడియన్స్ గా, దర్శకులుగా, హీరోగా కూడా కొందరు సినిమాలు చేస్తున్నారు. జబర్దస్త్ లో చాలా మంది లేడీ గెటప్స్ లో నవ్వులు పూయించారు. వారిలో తన్మయి ఒకరు. తన కామెడీ టైమింగ్ తో మెప్పించింది తన్మయి. జబర్దస్త్ తో పాటు పలు టీవీ షోల్లోనూ పాల్గొంటుంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో తన ట్రాన్స్ ట్రాన్స్‌ఫర్మేషన్‌కు దారితీసిన వ్యక్తిగత జీవిత పోరాటాల గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. చిన్నతనం నుంచే తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్న తన్మయికి డాక్టర్ కావాలనే కల ఉండేదని తెలిపింది. బైపీసీ చదువుకోవాలని ఆశపడినప్పటికీ, కుటుంబ ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడంతో డిగ్రీ వరకు పూర్తి చేశానని తెలిపింది తన్మయి. కుటుంబ పోషణ కోసం పెళ్లిళ్లలో జరిగే ఆర్కెస్ట్రాలలో డాన్సర్‌గా పనిచేశా , ఒక్కో ప్రదర్శనకు రూ.500 నుండి రూ.1500 డబ్బులు ఇచ్చారని తెలిపింది తన్మయి.

గత పదేళ్లుగా జబర్దస్త్, ఈవెంట్లు, షూటింగ్‌ల ద్వారా రూపాయి రూపాయి కూడబెట్టుకుని, గుంటూరులో ఒక మంచి మూడు అంతస్తుల ఇల్లు నిర్మించుకున్నా.. ఒకానొక సమయంలో తినడానికి కూడా లేని స్థితి నుండి తన కుటుంబ సభ్యులను సెటిల్ చేశా అని తెలిపింది తన్మయి. ఆమె తల్లి పొలం పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషించగా, తండ్రి మద్యానికి బానిసై కుటుంబాన్ని పట్టించుకోలేదని తన్మయి తెలిపింది. తన్మయి పెద్దన్నయ్య ఐదు సంవత్సరాల వయసులో క్యాన్సర్‌తో చనిపోవడం వల్ల తండ్రి మద్యానికి అలవాటు పడ్డారని. చిన్న అన్నయ్య శ్రీకాంత్ కూడా కుటుంబ పరిస్థితి దృష్ట్యా 10వ తరగతిలోనే చదువు మానేసి, కూలీ పని చేసి రోజుకు రూ.100 సంపాదించి కుటుంబానికి అండగా నిలబడ్డారు అని తెలిపింది తన్మయి.

జబర్దస్త్ ద్వారా గుర్తింపు, మంచి ఆర్థిక స్థితిని అందించినప్పటికీ, వ్యక్తిగత జీవితం మాత్రం చాలా దారుణంగా ఉందని తన్మయి ఎమోష్నలైంది. ప్రేమ, స్నేహం, కుటుంబ మద్దతు లేని ఒక ఒంటరి జీవితాన్ని తాను గడుపుతున్నానని తెలిపింది. ఒక వ్యక్తిని ఎనిమిదేళ్లు ప్రేమించి, తన కష్టార్జితాన్ని అతని కుటుంబం కోసం ఖర్చు చేసినా, చివరకు మోసపోయానని తెలిపింది. ట్రాన్స్‌జెండర్లు తరచుగా ఇలాంటి మోసాలకు గురవుతారని తెలిపింది. అలాగే ట్రాన్స్‌జెండర్లకు కుటుంబ మద్దతు, సామాజిక ఆదరణ దక్కదు. ఎవరైనా ప్రేమను చూపిస్తే, వెంటనే వారికి దగ్గరైపోయి, సర్వస్వం అర్పించడానికి సిద్ధపడతారని తెలిపింది తన్మయి. తన లింగమార్పిడి వెనుక హార్మోన్ల అసమతుల్యత, జన్యుపరమైన సమస్యలు ఉన్నాయని, ఇది తల్లిదండ్రుల లోపం వల్లనే వస్తుందని ఆమె ఒక వాస్తవాన్ని తెలిపారు. డబ్బు కోసమో, వేరే కారణాల కోసమో కాకుండా, ఒక ఆడపిల్లగా జీవించాలనే తన అంతర్గత కోరిక వల్లే ఈ మార్పును కోరుకున్నానని, మూడు సార్లు మరణం అంచుల వరకు వెళ్లి బ్రతికాను అని భావోద్వేగంగా చెప్పారు. తన తల్లికి కూతురుగా ఉంటూ, కొడుకులా కుటుంబాన్ని పోషించాలనేదే తన జీవితాశయమని తన్మయి పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us