AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాక్‌ అణు కేంద్రం పై భారత్‌ దాడి నిజమే.. సీక్రెట్‌ చెప్పిన నిపుణుడు

పాక్‌ అణు కేంద్రం పై భారత్‌ దాడి నిజమే.. సీక్రెట్‌ చెప్పిన నిపుణుడు

Phani CH
|

Updated on: Feb 19, 2026 | 4:08 PM

Share

ఆపరేషన్ సిందూర్‌ సమయంలో భారత్ పాకిస్తాన్‌ను చావు దెబ్బ కొట్టింది. పాక్ మిస్సైల్స్, డ్రోన్లను S-400 వ్యవస్థ కూల్చివేయగా, ప్రముఖ రక్షణ నిపుణుడు టామ్ కూపర్ వెల్లడించిన ప్రకారం భారత వాయుసేన కిరానా హిల్స్ అణు కేంద్రంపై దాడి చేసింది. ఈ దాడి తర్వాతే పాక్ కాల్పుల విరమణ కోరింది. భారత్ వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నప్పటికీ, ఈ సంఘటన అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.

ఆపరేషన్ సిందూర్‌ సమయంలో పాకిస్తాన్‌ను చావు దెబ్బ కొట్టింది భారత్‌. పాక్ ప్రయోగించిన మిస్సైల్స్, డ్రోన్లు తుస్సుమన్నాయి. భారత సైన్యం వాటిని గాల్లోనే పేల్చిపడేసింది. అంతేకాదు పాకిస్థాన్‌లోని కిరానా హిల్స్ అణు కేంద్రంపై భారత వాయుసేన దాడి చేసింది. ఈ సీక్రెట్‌ను ప్రముఖ రక్షణ రంగ నిపుణుడు టామ్ కూపర్ తాజాగా బయటపెట్టారు. ఆ దెబ్బతోనే పాక్‌ కాల్పుల విరమణ కోసం బతిమలాడిందని అన్నారు. ఆయన కామెంట్స్‌ ప్రస్తుతం అంతర్జాతీయంగా కలకలం రేపుతున్నాయి. మేం ఎక్కడైనా, ఎలాంటి దాడినైనా చేయగలం.. ఇక ఆపండి’ అనే బలమైన సందేశాన్ని భారత్ పాకిస్థాన్‌కు పంపిందని టామ్‌ కూపర్ తెలిపారు. తన వాదనకు బలం చేకూర్చే కొన్ని ఆధారాలను కూడా కూపర్ ప్రస్తావించారు. భారత మొదట రఫెల్, సుఖోయ్ యుద్ధ విమానాలతో పాక్ అణు కేంద్రాల ప్రవేశ ద్వారాలను పేల్చి వేసిందని తెలిపారు. పాకిస్థాన్‌లోని తన వ్యక్తిగత వర్గాలు కూడా ఈ దాడిని ధ్రువీకరించాయని ఆయన అన్నారు. భారత్‌ ఆ విషయాన్ని ఖండిస్తూనే వస్తోంది. అయితే అణు స్థావరాలపై జరిగిన దాడిని ఏ దేశమూ అధికారికంగా అంగీకరించదని రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇది అంతర్జాతీయంగా పెద్ద యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందని, భారత్ ‘వ్యూహాత్మక మౌనం’ పాటిస్తోందని భావిస్తున్నారు. ఈ ఆపరేషన్‌లో భారత ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ S-400, పాక్ డ్రోన్లు, మిసైళ్లను గాల్లోనే కూల్చేసి తన సత్తా చాటింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఈ దేశం ప్రజలకు ‘దోసకాయలు’ మరింత ప్రియం..

పాక్‌కు సింధ్ నీళ్లు బంద్‌ !! వేసవికి ముందు షాకిచ్చిన భార‌త్

ప్రియురాలిని హత్య చేసి.. ఆమె ఆత్మను పిలిచేందుకు తాంత్రిక పూజలు

పెళ్లికి అతిథిలా వచ్చాడు.. సరదాగా ఎత్తుకుపోయారు..

సాయం కావాలని ఆస్పత్రి మెట్లెక్కిన పక్షి !! చివరికి

తాళి కట్టే సమయానికి రద్దయిన వివాహం.. అసలు వాడు మగాడే కాదా?

Follow Us