భారత్‌కు దగ్గరగా చైనా అణు కేంద్రం బాంబు..
అరుణాచల్ సరిహద్దుకు సమీపంలో చైనా తన అణు కేంద్రాలను పునరుద్ధరిస్తున్నట్లు ఉపగ్రహ చిత్రాలు వెల్లడిస్తున్నాయి. 2030 నాటికి వెయ్యికి పైగా అణు వార్‌హెడ్‌లను సమకూర్చుకోవాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది. భారత్‌తో వివాదాలున్న ప్రాంతంలో ఈ కార్యకలాపాలు పెంచడం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది. ఇది చైనా అణ్వాయుధ విస్తరణ వ్యూహంలో భాగం.
అరుణాచల్ తమదేనంటూ ప్రతిసారి భారత్‌తో వాదనకు దిగే చైనా.. ఇపుడు దానికి దగ్గర్లో ఉన్న అణు కేందాన్ని యాక్టివ్‌గా మారుస్తున్నట్లు వార్తలు కలకలం రేపాయి. వందల మంది సైంటిస్ట్‌లు, కార్మికులు కలిసి అణు కేంద్రంలో పనులు చేస్తున్నట్లు శాటిలైట్ చిత్రాల ద్వారా వెల్లడైనట్లు న్యూయార్క్ టైమ్స్ కథనం తెలిపింది. అక్కడ కొత్త బంకర్లు, అత్యంత భారీ పేలుడు పదార్థాలను తట్టుకోగల పైపింగ్‌ను ఏర్పాటు చేసారని రాసుకొచ్చింది. 2030 నాటికి కనీసం 1,000 పై చిలుకు అణు వార్‌హెడ్ల సామర్థ్యం సంతరించుకోవాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది! వాస్తవానికి సిచువాన్ పర్వత ప్రాంతాల్లో చైనా అణు ప్లాంట్లు కొత్తేమీ కాదు. అమెరికా, నాటి సోవియట్ యూనియన్‌లకు దీటుగా ఎదిగే ఉద్దేశంతో 60 ఏళ్ల కిందట నిర్మించినవే. అప్పట్లోనే వాటిలో వేలాదిగా సైంటిస్టులు, ఇంజనీర్లు, కార్మికులను వినియోగించింది. జిటాంగ్, పింగ్‌టాంగ్ ప్లాంట్లలో అణు కార్యక్రమాలను దూకుడుగా కొనసాగించింది. అయితే 1980ల నాటికి అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తగ్గిపోవడంతో అక్కడ సిబ్బందిని భారీగా తగ్గించేసింది. కానీ 20 ఏళ్లుగా ఆ రెండు ప్లాంట్లపై చైనా బాగా దృష్టి పెట్టినట్టు చెబుతున్నారు. అంతేగాక అణు వార్‌హెడ్ల తయారీకి వాటిని పూర్తిస్థాయిలో రెడీ చేసిందట! అణ్వాయుధాల విషయంలో రష్యా, అమెరికా తర్వాత చైనా మూడో స్థానంలో ఉంది. చైనా వద్ద కనీసం 600 అణు వార్‌హెడ్లు ఉన్నట్టు అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ అంచనా వేసింది. 2030 నాటికి దాన్ని కనీసం 1,000కి పెంచుకోవాలని చైనా లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపింది. ప్రస్తుతం రష్యా వద్ద ఏకంగా 5,400 అణు వార్‌హెడ్లు ఉండగా అమెరికా వద్ద 5,200 దాకా ఉన్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Toxic: స్పీడ్ పెంచిన టాక్సిక్.. ధురందర్‌ని ఢీకొట్టడానికేనా
Mrunal Thakur: అవకాశాలను సృష్టించుకోవాలి.. విజయ రహస్యాన్ని చెప్పిన మృణాల్
Alia Bhatt: ఆలియా భట్ అంతర్జాతీయ గుర్తింపు
Sandeep Reddy Vanga: నా కోసం హీరోలు మారారు.. కానీ ఇప్పుడు మహేష్ కోసం నేను మారతా
ఈ దేశం ప్రజలకు 'దోసకాయలు' మరింత ప్రియం..
ట్యాబ్లెట్ వేసుకుంటూనే కుప్పకూలిన సాఫ్ట్వేర్ ఇంజనీర్
తన బిడ్డను చంపిందని.. పులిని ఫారెస్ట్ అధికారులకు పట్టించిన ఆవు..
తాళి కట్టే సమయానికి రద్దయిన వివాహం.. అసలు వాడు మగాడే కాదా?
సాయం కావాలని ఆస్పత్రి మెట్లెక్కిన పక్షి !! చివరికి
పెళ్లికి అతిథిలా వచ్చాడు.. సరదాగా ఎత్తుకుపోయారు..
ప్రియురాలిని హత్య చేసి.. ఆమె ఆత్మను పిలిచేందుకు తాంత్రిక పూజలు

