ఈ దేశం ప్రజలకు ‘దోసకాయలు’ మరింత ప్రియం..
రష్యాలో దోసకాయల ధరలు కిలో ₹356కి పెరిగాయి, ఉక్రెయిన్ యుద్ధం, ఆర్థిక సంక్షోభం దీనికి ప్రధాన కారణం. సరఫరా గొలుసు అంతరాయాలు, విద్యుత్ సంక్షోభం రైతులను ప్రభావితం చేశాయి. రష్యన్లు దోసకాయలను "కొత్త బంగారం"గా ఎగతాళి చేస్తున్నారు, ఇది దేశ ఆర్థిక పరిస్థితిని ప్రతిబింబిస్తుంది. కొన్ని దుకాణాల్లో కొనుగోళ్లపై పరిమితులు విధించారు.
ఆ దేశంలో దోసకాయల ధరలు భారీగా పెరిగాయి. రష్యన్లు దోసకాయలను న్యూ గోల్డ్‌గా పిలుచుకుంటున్నారు. ప్రస్తుతం రష్యాలో కిలో దోసకాయల ధర 300 రూబుళ్లు అంటే మన కరెన్సీలో సుమారు 356 రూపాయలు పలుకుతోంది. మూడేళ్లగా ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న రష్యాలో ఆర్థిక సంక్షోభం నెలకొంది. చమురు ఆదాయం తగ్గుతోంది. మరో వైపు యుద్ధానికి ఖర్చు తడిసి మోపెడవుతోంది. దాంతో రష్యా ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది. నిత్యవసర వస్తువుల ధరలూ ఆకాశాన్నంటుతున్నాయి. దోసకాయల ధరలపై సోషల్ మీడియాలో అక్కడి ప్రజలు సెటైర్‌లు వేస్తున్నారు. దోసకాయలే తమ బంగారు ఆభరణాలు అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. మరి కొందరు దోసకాయలతో ఫోటోలు దిగి వాటిని ఖరీదైన లగ్జరీ వస్తువుల్లా చూపిస్తూ రష్యా ఆర్థిక పరిస్థితిని ఎగతాళి చేస్తున్నారు. ధరల పెరుగుదల కారణంగా సైబీరియాలోని కొన్ని సూపర్ మార్కెట్లు ఒక్కో కస్టమర్ తక్కువ పరిమాణంలోనే దోసకాయలు కొనాలని నిబంధనలు కూడా విధించాయి. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా దిగుమతులపై ఆంక్షలు పెరగడం, సప్లై చైన్ దెబ్బతినడం కారణంగా చెబుతున్నారు. విద్యుత్ సంక్షోభం కారణంగా దోసకాయల వంటి సీజనల్ పంటలు పండించడానికి అవసరమయ్యే విద్యుత్ ఖర్చును రైతులు భరించలేకపోతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పాక్‌కు సింధ్ నీళ్లు బంద్ !! వేసవికి ముందు షాకిచ్చిన భారత్
ప్రియురాలిని హత్య చేసి.. ఆమె ఆత్మను పిలిచేందుకు తాంత్రిక పూజలు
పెళ్లికి అతిథిలా వచ్చాడు.. సరదాగా ఎత్తుకుపోయారు..
సాయం కావాలని ఆస్పత్రి మెట్లెక్కిన పక్షి !! చివరికి
తాళి కట్టే సమయానికి రద్దయిన వివాహం.. అసలు వాడు మగాడే కాదా?
Cow: తన బిడ్డను చంపిందని.. పులిని ఫారెస్ట్ అధికారులకు పట్టించిన ఆవు..
ఈ దేశం ప్రజలకు 'దోసకాయలు' మరింత ప్రియం..
ట్యాబ్లెట్ వేసుకుంటూనే కుప్పకూలిన సాఫ్ట్వేర్ ఇంజనీర్
తన బిడ్డను చంపిందని.. పులిని ఫారెస్ట్ అధికారులకు పట్టించిన ఆవు..
తాళి కట్టే సమయానికి రద్దయిన వివాహం.. అసలు వాడు మగాడే కాదా?
సాయం కావాలని ఆస్పత్రి మెట్లెక్కిన పక్షి !! చివరికి
పెళ్లికి అతిథిలా వచ్చాడు.. సరదాగా ఎత్తుకుపోయారు..
ప్రియురాలిని హత్య చేసి.. ఆమె ఆత్మను పిలిచేందుకు తాంత్రిక పూజలు

