66 ఏళ్ల వయసులో పాతికేళ్ల కుర్రాడిలా.. నాగార్జున జుట్టు రహస్యం ఇదే..

Rajitha Chanti

Pic credit - Instagram

19 February 2026

టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దశాబ్దాలుగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు.

ప్రస్తుతం ఆయన వయసు 66 సంవత్సరాలు. ఇప్పటికీ కుర్ర హీరోలకు సైతం షాకిచ్చే ఫిట్నెస్, లుక్స్ తో కనిపిస్తుంటారు. అలాగే నాగ్ జుట్టు రహస్యం తెలుసా.. ?

ఇటీవల నాగార్జున జీవనశైలి, ఆరోగ్య రహస్యాలను ఆయన మేకప్ మెన్ ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. నాగార్జున ఆరోగ్యం గురించి పలు విషయాలు తెలిపారు. 

నాగార్జున వారంలో ఐదు రోజులు మాములు ఆహారాన్నే మితంగా తీసుకుంటారని అన్నారు. అల్పాహారంగా ఒకే ఇడ్లీ, వడ లేదా గారె మాత్రమే తీసుకుంటారట. 

ఆకలి వేసినప్పుడే తీసుకుంటారని.. ఆకలి లేకపోతే అసలు తినరని అన్నారు. మధ్యాహ్న భోజనంలో ప్రతిరోజు బెండకాయ ఉండాల్సిందేనని, హాట్ చిప్స్ ఉండాలని అన్నారు.

దంప్పుడు బియ్యం తీసుకుంటారట. ఇవి బాగా మెత్తగా, ముద్దగా ఉంటేనే ఆయన ఇష్టపడతారని.. మధ్యాహ్నం రసం, అరటిపండు తీసుకుంటారని చెప్పుకొచ్చారు.

 ఇక జుట్టు కోసం ప్రత్యేక జ్యూస్ తాగుతారట. రాగి గ్లాసులో నిమ్మకాయ, ఉసిరికాయ, క్యారెట్, బీట్ రూట్, పటిక బెల్లం లేదా తేనె కలిపి జ్యూస్ తయారు చేస్తారట.

అదే జ్యూస్ ను రోజూ పరిగడుపున తీసుకుంటారని.. జ్యూస్ కారణంగానే ఆయన జుట్టు రాలదని.. అన్నమయ్య సినిమాకు మాత్రమే విగ్గు వాడరని అన్నారు.