Telangana: పెద్దమ్మ ఎలా ఏమార్చారో చూడండి.. ఏకంగా 16 తులాల..
సంగారెడ్డి జిల్లా జోగిపేట బస్టాండ్‌లో పట్టపగలే భారీ చోరీ జరిగింది. అల్లాదుర్గం మండలానికి చెందిన చెగురి లక్ష్మి అనే వృద్ధురాలు హైదరాబాద్‌లో జరగనున్న తన మేనకోడలి కుమారుడి వివాహానికి వెళ్లేందుకు బస్టాండ్‌కు వచ్చింది. జోగిపేటలో బస్సు దిగిన తర్వాత, తన వియ్యంకురాలితో కలిసి హైదరాబాద్ వెళ్లే మరో బస్సు ఎక్కుతుండగా రద్దీని ఆసరాగా చేసుకున్న దుండగులు ఆమె బ్యాగులో భద్రంగా దాచుకున్న 16 తులాల బంగారు ఆభరణాలను అత్యంత చాకచక్యంగా కాజేశారు.
బంగారం దొంగతనాలు చేసే ముఠాలు రోజురోజుకీ రెచ్చిపోతున్నాయి. మొన్నటి వరకు అర్ధరాత్రి ఇళ్లలోకి చొరబడి చోరీలు చేసిన దొంగలు.. ఇప్పుడు పట్టపగలే రోడ్ల మీద, బస్టాండ్‌ల్లో వృద్ధులను టార్గెట్ చేస్తూ దోచుకుంటున్నారు. ముఖ్యంగా ఒంటరిగా ఉన్నవారు, సహాయం కోసం ఎదురు చూస్తున్న అవ్వాతాతలను ఎంచుకుని.. వాళ్ల వద్ద ఉన్న విలువైన ఆభరణాలను అత్యంత చాకచక్యంగా కాజేస్తున్నారు. రద్దీగా ఉండే బస్టాండ్‌లలో ప్రయాణించే వృద్ధులను లక్ష్యంగా చేసుకుని ఈ ముఠాలు దర్జాగా చోరీలకు పాల్పడుతున్నాయి.ఇలాంటి ఘటనే తాజాగా సంగారెడ్డి జిల్లాలో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా జోగిపేట కేంద్రంలోని బస్టాండ్‌లో పట్టపగలే భారీ చోరీ చోటుచేసుకుంది. గుర్తు తెలియని దుండగులు ఒక వృద్ధురాలిని లక్ష్యంగా చేసుకుని.. ఆమె బ్యాగులో ఉన్న 16 తులాల బంగారాన్ని అత్యంత చాకచక్యంగా కాజేశారు.
అల్లాదుర్గం మండలానికి చెందిన చెగురి లక్ష్మి అనే వృద్ధురాలు.. హైదరాబాద్‌లో జరగనున్న తన మేనకోడలి కుమారుడి వివాహానికి వెళ్లేందుకు బస్టాండ్‌కు వచ్చింది. అల్లాదుర్గం నుంచి బస్సులో ప్రయాణించి జోగిపేట బస్టాండ్‌కు చేరుకున్న ఆమె… అక్కడ తన వియ్యంకురాలితో కలిసి హైదరాబాద్ వెళ్లే మరో బస్సు ఎక్కే ప్రయత్నం చేసింది. అయితే.. బస్టాండ్‌లో ఉన్న రద్దీని ఆసరాగా చేసుకున్న దుండగులు.. ఆమె బ్యాగులో భద్రంగా దాచుకున్న 16 తులాల బంగారు ఆభరణాలను దొంగిలించారు.బస్సు ఎక్కిన కొద్దిసేపటికే బ్యాగు తెరిచి చూసిన బాధితురాలికి.. బంగారం కనిపించకపోవడంతో లబోదిబోమంటూ కన్నీరుమున్నీరయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు జోగిపేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు… బస్టాండ్ ఆవరణలోని సీసీటీవీ ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. 16 తులాల బంగారం పోవడంతో బాధితురాలి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ దేశం ప్రజలకు 'దోసకాయలు' మరింత ప్రియం..
ట్యాబ్లెట్ వేసుకుంటూనే కుప్పకూలిన సాఫ్ట్వేర్ ఇంజనీర్
తన బిడ్డను చంపిందని.. పులిని ఫారెస్ట్ అధికారులకు పట్టించిన ఆవు..
తాళి కట్టే సమయానికి రద్దయిన వివాహం.. అసలు వాడు మగాడే కాదా?
సాయం కావాలని ఆస్పత్రి మెట్లెక్కిన పక్షి !! చివరికి
పెళ్లికి అతిథిలా వచ్చాడు.. సరదాగా ఎత్తుకుపోయారు..
ప్రియురాలిని హత్య చేసి.. ఆమె ఆత్మను పిలిచేందుకు తాంత్రిక పూజలు

