AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mammootty: ఆ రోజులను గుర్తు చేసుకుంటూ స్టార్ హీరో ఎమోషనల్

Mammootty: ఆ రోజులను గుర్తు చేసుకుంటూ స్టార్ హీరో ఎమోషనల్

Phani CH
|

Updated on: Feb 19, 2026 | 6:01 PM

Share

మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి తన తీవ్ర అనారోగ్య పోరాటం గురించి ఎమోషనల్‌గా పంచుకున్నారు. రుచి, వాసన గ్రహణశక్తిని తాత్కాలికంగా కోల్పోయిన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. వాటి విలువను అప్పుడే తెలుసుకున్నానని తెలిపారు. ఆ కష్టాలను అధిగమించి, బాక్సాఫీస్ వద్ద మళ్లీ తన హవాను చూపిస్తున్న మమ్ముట్టి సినీ ప్రస్థానం, పద్మభూషణ్ వంటి ఆయన విజయాలు నిజంగా స్ఫూర్తిదాయకం.

మలయాళ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది స్టార్ హీరో అయిన మమూకా.. తీవ్ర ఆనారోగ్య సమస్యలను దాటుకుని వచ్చారు. ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యంతో బౌన్స్‌ బ్యాక్ అయి.. మళ్లీ సినిమా చూస్తున్నారు. బాక్సాఫీస్ దగ్గర తన హవా చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే తన అనారోగ్య రోజులను గుర్తు చేసుకున్నారు. ఆ చేదు పరిస్థితుల గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. మనిషికి కంటిచూపు, వినికిడి చాలా ముఖ్యమైనవన్న మమ్ముట్టి.. రుచి, వాసనను ఫీలవడం కూడా.. ముఖ్యమే అంటూ చెప్పుకొచ్చారు. కానీ తాను కొంత కాలం రుచి, వాసనకు దూరంగా ఉన్నానంటూ చెప్పుకొచ్చారు. అనారోగ్యం కారణంగా.. తాను రుచి, వాసన చూసే గ్రహణ శక్తిని కోల్పోయానంటూ మమ్ముట్టి చెప్పుకొచ్చారు.అయితే ఆ సామర్థ్యాలను కోల్పోయినప్పుడే వాటి విలువ మనకు అర్థమవుతుందంటూ చెప్పుకొచ్చారు. మమ్ముట్టి 1951 సెప్టెంబర్‌ 7న కేరళలోని అలప్పుళ జిల్లా చండీరూర్‌లో జన్మించాడు. ఎల్‌ఎల్‌బీ డిగ్రీ చదివిన ఆయన రెండేళ్లు న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేశాడు. 1971లో ‘అనుభవంగళ్‌ పాలిచకల్‌’ మూవీలో ఓ చిన్నపాత్రతో నటన ప్రారంభించాడు. ‘విల్కన్‌ ఉండూ స్వప్నంగళ్‌’ సినిమాతో హీరోగా మారాడు. ఏడాదికి ఇరవైకి పైగా సినిమాలు చేశాడు. అలా దాదాపు 400కి పైగా చిత్రాల్లో నటించాడు. సినీ పరిశ్రమలో ఆయన అందించిన సేవలకుగానూ మమ్ముట్టికి పద్మభూషణ్‌ అవార్డు వరించింది. ప్రస్తుతం ఈయన పాత్ర, పేట్రియాట్‌ సినిమాల్లో నటిస్తున్నాడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Gold Price Today: బంగారం ప్రియులకు షాకింగ్ న్యూస్‌

Naga Chaitanya: నాగ చైతన్యతో.. గంగూలీ, జాన్‌ అబ్రహాం ఢీ అంటే ఢీ.. ఇంతకీ గెలిచేది ఎవరో

Varanasi: వారణాసిలో ప్రకాశ్ రాజ్ క్యారెక్టర్ రివీల్.. మంచి ఛాన్స్ కొట్టేశాడుగా

ప్రియురాలిని హత్య చేసి.. ఆమె ఆత్మను పిలిచేందుకు తాంత్రిక పూజలు

పెళ్లికి అతిథిలా వచ్చాడు.. సరదాగా ఎత్తుకుపోయారు..

Follow Us