Varanasi: వారణాసిలో ప్రకాశ్ రాజ్ క్యారెక్టర్ రివీల్.. మంచి ఛాన్స్ కొట్టేశాడుగా
రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం 'వారణాసి' (SSMB29)లో ప్రకాశ్ రాజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మహేష్‌తో ఆయనది హిట్ కాంబినేషన్ కాగా, 20 ఏళ్ల తర్వాత రాజమౌళితో తిరిగి పనిచేస్తున్నారు. సినిమాలో ప్రకాశ్ రాజ్ శివభక్తుడిగా నటిస్తున్నారని, ఇప్పటికే 50% షూటింగ్ పూర్తైందని ఆయన వెల్లడించారు. ఈ ప్రత్యేక కలయిక సినిమాపై అంచనాలను భారీగా పెంచుతోంది.
ఒకప్పుడు రాజమౌళి సినిమా అప్‌డేట్స్ కోసం చకోర పక్షుల్లా వేచి చూసేవాళ్లు అభిమానులు. కానీ ఇప్పుడు వారణాసి గురించి వద్దన్నా రోజుకో అప్‌డేట్ వచ్చేస్తుంది. తాజాగా సినిమాలో నటిస్తున్న ఓ కీలక నటుడు మరో మేజర్ అప్‌డేట్ చెప్పేసాడు. పైగా మహేష్‌తో ఆయనది హిట్ కాంబినేషన్ కూడా..! అన్నింటికీ మించి 20 ఏళ్ళ తర్వాత రాజమౌళితో పని చేస్తున్నాడాయన. మరి ఆ ముచ్చటేంటో చూద్దామా..? టాలీవుడ్ మోస్ట్ క్రేజియస్ట్ కాంబినేషన్స్‌లో మహేష్, ప్రకాశ్ రాజ్ ఒకటి. అప్పుడెప్పుడో రాజకుమారుడు నుంచి మొదలై ఒక్కడు, పోకిరి, ఖలేజా, దూకుడు, మహర్షి, మొన్నటి సరిలేరు నీకెవ్వరు వరకు ఎన్నో సినిమాల్లో కలిసి నటించారు మహేష్, ప్రకాశ్. తాజాగా వారణాసిలో నటిస్తున్నారు ఈ విలక్షణ నటుడు. ఇందులో శివభక్తుడిగా నటిస్తున్నారు ప్రకాశ్ రాజ్. మహేష్, ప్రకాశ్ రాజ్ రెగ్యులర్ కాంబినేషన్ కానీ.. జక్కన్నతో ప్రకాశ్ రాజ్ మాత్రం కొత్తే. 20 ఏళ్ళ కింద విక్రమార్కుడులో చిన్న పాత్ర చేసారు ప్రకాశ్. అంతే.. ఆ తర్వాత మళ్లీ రాజమౌళి సినిమాలో ప్రకాశ్ రాజ్ కనిపిచిందే లేదు. ఇన్నాళ్లకు వారణాసిలో శివభక్తుడుగా పెద్ద పాత్రే చేస్తున్నట్లు తెలిపారు ప్రకాశ్ రాజ్. ఇప్పటికే వారణాసి షూటింగ్ 50 శాతం పూర్తైపోయింది. బయట దేవుడిపై రాజకీయంగా సంచలన వ్యాఖ్యలు చేసే ప్రకాశ్ రాజ్.. తన వ్యక్తిత్వానికి భిన్నంగా శివభక్తుడిగా నటిస్తున్నారు. గతంలో ఢమరుకంలో శివుడిగా నటించారు ఈ నటుడు. మొత్తానికి ఇటు మహేష్-ప్రకాశ్ కాంబో.. అటు రాజమౌళితో 20 ఏళ్ళ తర్వాత సినిమా.. ఇవన్నీ వారణాసిని మరింత ప్రత్యేకంగా మార్చేస్తున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రియురాలిని హత్య చేసి.. ఆమె ఆత్మను పిలిచేందుకు తాంత్రిక పూజలు
పెళ్లికి అతిథిలా వచ్చాడు.. సరదాగా ఎత్తుకుపోయారు..
సాయం కావాలని ఆస్పత్రి మెట్లెక్కిన పక్షి !! చివరికి
తాళి కట్టే సమయానికి రద్దయిన వివాహం.. అసలు వాడు మగాడే కాదా?
Cow: తన బిడ్డను చంపిందని.. పులిని ఫారెస్ట్ అధికారులకు పట్టించిన ఆవు..
ఈ దేశం ప్రజలకు 'దోసకాయలు' మరింత ప్రియం..
ట్యాబ్‌లెట్ వేసుకుంటూనే కుప్పకూలిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్
తన బిడ్డను చంపిందని.. పులిని ఫారెస్ట్ అధికారులకు పట్టించిన ఆవు..
తాళి కట్టే సమయానికి రద్దయిన వివాహం.. అసలు వాడు మగాడే కాదా?
సాయం కావాలని ఆస్పత్రి మెట్లెక్కిన పక్షి !! చివరికి
పెళ్లికి అతిథిలా వచ్చాడు.. సరదాగా ఎత్తుకుపోయారు..
ప్రియురాలిని హత్య చేసి.. ఆమె ఆత్మను పిలిచేందుకు తాంత్రిక పూజలు

