AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వ్యాపారస్తులకు ఇక లాభాలే లాభాలు.. రాత్రంతా వ్యాపారాలు చేసుకునేలా సర్కార్ వెసులుబాటు..!

ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం మొదలైపోయింది. ప్రత్యేక ప్రార్థనలతో, ఉపవాసాలతో భక్తి ప్రవృత్తుల నడుమ రంజాన్ పర్వదినాన్ని ఘనంగా నిర్వహించుకునేందుకు ముస్లింలు సిద్ధమయ్యారు. ముఖ్యంగా హైదరాబాద్ జంట నగరాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ముస్లింలు రంజాన్ మాసాన్ని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు.

వ్యాపారస్తులకు ఇక లాభాలే లాభాలు.. రాత్రంతా వ్యాపారాలు చేసుకునేలా సర్కార్ వెసులుబాటు..!
Charminar Night Market
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: Feb 19, 2026 | 8:06 PM

Share

ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం మొదలైపోయింది. ప్రత్యేక ప్రార్థనలతో, ఉపవాసాలతో భక్తి ప్రవృత్తుల నడుమ రంజాన్ పర్వదినాన్ని ఘనంగా నిర్వహించుకునేందుకు ముస్లింలు సిద్ధమయ్యారు. ముఖ్యంగా హైదరాబాద్ జంట నగరాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ముస్లింలు రంజాన్ మాసాన్ని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఎంతో నిష్ఠతో అల్లాకు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఇప్పటికే నగరాల్లో వ్యాపార, దుకాణ సముదాయాలు కిటకిటలాడుతూ కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో వ్యాపారస్తులు రాత్రంతా తమ వ్యాపారాలను నిర్వహించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అవకాశం కల్పించింది.

రంజాన్ పవిత్రమైన మాసం కావడంతో రాత్రంతా వ్యాపారాలు చేసుకునేలా తెలంగాణ ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ క్రమంలో ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్ర సర్కార్ జారీ చేసింది. ప్రభుత్వ సానుకూల నిర్ణయం పట్ల వ్యాపారస్తులు, ముస్లిం సోదరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అత్యంత పవిత్రమైన రంజాన్ మాసాన్ని కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి మరింత ఆనందోత్సాహాల నడుమ జరుపుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రభుత్వం కల్పించిన అవకాశం తమకెంతో మేలు చేస్తుందని, ఈ నెలంతా పెద్దఎత్తున వ్యాపారం జరుగుతుందని, ఇది తమకు ఆర్థికంగా ఎంతో లాభాలు చేకూరుస్తుందని వ్యాపారస్తులు చెబుతున్నారు. కాగా, ప్రభుత్వ నిర్ణయం మేరకు పోలీసులు ముస్లింలకు, బడా వ్యాపారస్తులకు పలు సూచనలు చేశారు.

రంజాన్ అంటేనే ముందుగా గుర్తొచ్చేది హలీమ్..! ఇది లేకుండా రంజాన్ మాసం పూర్తవదనేది హలీం ప్రియులు చెబుతున్న మాట. ఎంతో మంది హలీమ్ కోసం ఏడాదంతా ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటారు కూడా. ఈ క్రమంలో హలీమ్ వ్యాపారులకు పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు. హలీమ్ వ్యాపారం చేసుకోండి.. అదే విధంగా రోడ్లపై ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా నిర్వాహకులే చూసుకోవాలని సూచిస్తున్నారు. హలీమ్ ఏర్పాటు చేసే దుకాణ సముదాయాల వద్ద వచ్చిన కస్టమర్లకు నాణ్యతతో కూడిన హలీమ్‌ను అందించడంతో పాటు జనం పెద్దఎత్తున గుమిగూడకుండా చూడాలని ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

కాగా, 2026లో జీహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో కులమతాలకు అతీతంగా ఇఫ్తార్ విందులు ఏర్పాట్ల కోసం రాజకీయ నాయకులు సైతం ప్రణాళికలు చేసుకుంటున్నారు. పార్టీలకు అతీతంగా పవిత్ర రంజాన్ మాసాన్ని ఆనందంగా జరుపుకోవాలని.. అందుకు గాను తెలంగాణలోని ఆయా పార్టీలు సహకరించాలని తెలంగాణ పోలీస్ శాఖ కోరింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us