ఇష్టమని ఇలా తిన్నారో.. ఒంట్లో రోగాలు తిష్టవేస్తాయ్!
19 February 2026
TV9 Telugu
TV9 Telugu
ఆలుగడ్డలు చాలా ప్రత్యేకమైనవి. చాలా మంది ఇష్టంగా తినే వంటకాల్లో ఇవి తప్పక ఉంటాయి. పైగా వీటి ధర కూడా తక్కువ. వీటితో అనేక రకాల వంటకాలను తయారు చేసి ఆరగిస్తుంటారు
TV9 Telugu
ఆలు వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. ఇవి రుచికే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగపడతాయి. చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడంలో కూడా ఆలుగడ్డలు సహాయపడతాయి
TV9 Telugu
అయితే వీటిని సరైన విధంగా తీసుకోకుంటే మేలు కంటే ప్రమాదం ఎక్కువని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తప్పు పద్ధతుల్లో వీటిని తీసుకోవడం వల్ల శరీర బరువు పెరగడంతో పాటు టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది
TV9 Telugu
ప్రస్తుతం టైప్ 2 డయాబెటిస్ సర్వసాధారణమైపోయింది. ముఖ్యంగా ఆలుగడ్డలను ఫ్రెంచ్ ఫ్రైస్ రూపంలో తీసుకోవడం వల్ల ఇవి టైప్ 2 డయాబెటిస్ కు దారి తీస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు
TV9 Telugu
దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడంతో పాటు ఇన్సులిన్ నిరోధకత పెరుగుతుంది. ఇది క్రమంగా గుండె జబ్బులకు దారి తీస్తుంది. శరీర అవయవాల పనితీరు తగ్గుతుంది
TV9 Telugu
డీప్ ఫ్రై రూపంలో ఆలు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఆలుగడ్డలను ఉడికించి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుందని, డయాబెటిస్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు
TV9 Telugu
డయాబెటిస్ సమస్య రాకుండా ఉండాలంటే అధిక ఫైబర్, ప్రోటీన్ ఉండే ఆహారాలను తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి
TV9 Telugu
టీ, కాఫీ లను చక్కెర లేకుండా తీసుకోవాలి. ఎనర్జీ డ్రింక్స్, శీతల పానీయాలకు దూరంగా ఉండాలి. బ్రౌన్ రైస్, క్వినోవా, సోర్‌డోఫ్ బ్రెడ్ వంటి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండే ఆహారాలను తీసుకోవాలి