శ్రీ సత్యసాయి జిల్లాలోని రొళ్ళ మండలంలోని ఒక పర్ఫ్యూమ్ ఫ్యాక్టరీపై కర్ణాటక అటవీ శాఖ అధికారులు దాడి చేశారు. ఈ దాడుల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 173 కిలోల గంధపు చెక్కలను సీజ్ చేశారు. చోరీకి గురైన ఈ చెక్కల విలువ లక్షల్లో ఉంటుందని అంచనా. సూత్రధారుల కోసం గాలింపు కొనసాగుతోంది.