Cooking Oil: వంటనూనెకి సంబంధించి ఈ తప్పు చేస్తున్నారా.. క్యాన్సర్‌ బారిన పడొచ్చు జాగ్రత్త..!

Cooking Oil: ఆహార పదార్థాలు తయారచేయడంలో వంటనూనె ప్రధాన పాత్ర పోషిస్తుంది. నూనె లేకపోతే వంటగదిలో ఏ పని జరగదు. నూనె ఆహారాన్ని

Cooking Oil: వంటనూనెకి సంబంధించి ఈ తప్పు చేస్తున్నారా..  క్యాన్సర్‌ బారిన పడొచ్చు జాగ్రత్త..!
Cooking Oil
Follow us

|

Updated on: May 20, 2022 | 9:59 PM

Cooking Oil: ఆహార పదార్థాలు తయారచేయడంలో వంటనూనె ప్రధాన పాత్ర పోషిస్తుంది. నూనె లేకపోతే వంటగదిలో ఏ పని జరగదు. నూనె ఆహారాన్ని రుచిగా మార్చుతుంది. అందులో ఉండే పోషకాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. భారతదేశంలో ఆహార రుచిని పెంచడానికి వంట నూనెని అధికంగా ఉపయోగిస్తున్నారు. అయితే ఒక్కసారి వాడిన నూనెని మళ్లీ మళ్లీ తిరిగి వాడుతున్నారు. ఈ పద్దతి శరీరానికి చాలా ప్రమాదకరం. ఇది క్యాన్సర్‌తో సహా అనేక వ్యాధులకి గురిచేస్తుంది. దీని గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.

బ్యాడ్ కొలస్ట్రాల్

నూనెను ఎంత తక్కువగా తీసుకుంటే శరీరానికి అంత మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అధిక నూనె తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది. దీనివల్ల మనకు గుండె జబ్బులు ఎదురవుతాయి. వంటనూనెను మళ్లీ ఉపయోగించే అలవాటు మెదడు ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. దీని వల్ల మీకు మతిమరుపు రావచ్చు.

ఇవి కూడా చదవండి

క్యాన్సర్ ప్రమాదం

క్యాన్సర్ పేరు వినగానే మదిలో భయాందోళనలు కలుగుతాయి. వంట నూనెను మళ్లీ వేడి చేయడం వల్ల పాలీసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్ (PAHs) వంటి అనేక రకాల హానికరమైన పదార్థాలు ఉత్పత్తి అవుతాయి. ఇటువంటి పదార్థాలు శరీరంలో క్యాన్సర్ ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతాయి.

గుండెల్లో మంట

వంట నూనెను మళ్లీ మళ్లీ వేడి చేయడం వల్ల రాన్సిడిటీ అనే విష ప్రక్రియ ప్రారంభమవుతుంది. దీనిని సాధారణంగా రాన్సిడిటీ అంటారు. నూనెని మళ్లీ మళ్లీ వాడితే పొట్ట సమస్యలు ప్రారంభమవుతాయి. వంటనూనెను మళ్లీ వేడి చేసి తింటే అసిడిటీ సమస్య ఎదురవుతుంది.

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

మరిన్ని హెల్త్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి