Virat Kohli: విరాట్ కోహ్లీ అంటేనే గ్రేట్.. బాబర్ ఆజంతో పోలికలపై పాకిస్థాన్ మాజీ పేసర్ ఘాటు స్పందన!
మహ్మద్ అమీర్ విరాట్ కోహ్లీని ఈ తరం అత్యుత్తమ ఆటగాడిగా అభివర్ణించారు. బాబర్ ఆజమ్ వంటి ఆటగాళ్లతో పోలికలు అనవసరమని అన్నారు. జో రూట్, స్టీవ్ స్మిత్‌లు కూడా కోహ్లీకి సరిరారని పేర్కొన్న అమీర్, కోహ్లీ పని తీరు, స్థిరత్వం అతన్ని ప్రత్యేకంగా నిలిపిన కారణాలని ప్రశంసించారు. సచిన్ టెండూల్కర్‌ను అవుట్ చేయడాన్ని చాలా ప్రత్యేక క్షణంగా గుర్తు చేసుకున్నారు అమీర్.
పాకిస్థాన్ మాజీ పేసర్ మహమ్మద్ అమీర్, తన రిటైర్మెంట్ తర్వాత జరిగిన ఓ ఇంటర్వ్యూలో భారత స్టార్ విరాట్ కోహ్లీపై కీలక వ్యాఖ్యలు చేసాడు. “విరాట్ కోహ్లీ ఈ తరంలోనే అత్యుత్తమ ఆటగాడు. అతన్ని బాబర్ ఆజమ్, జో రూట్, స్టీవ్ స్మిత్‌లతో పోల్చడం అనవసరమని నేను భావిస్తాను,” అని అమీర్ స్పష్టం చేశారు. భారతదేశానికి అనేక విజయాలను అందించిన కోహ్లీని ఈ తరం గొప్ప ఆటగాడిగా పేర్కొన్నాడు.
అమీర్ మాట్లాడుతూ, కోహ్లీ ఆట పట్ల ఉన్న నిబద్ధత, ఆత్మవిశ్వాసం అతనికి నిలకడగా గొప్ప ప్రదర్శనల వేదిక అయ్యాయని అన్నారు. “2014 ఇంగ్లాండ్ పర్యటనలో కోహ్లీ ఓ ఆటగాడిగా ఎదగడం ప్రారంభించాడు. ఆ తర్వాతి పదేళ్లలో అతను అద్భుతమైన స్థాయిలో కొనసాగాడు. అతని స్థిరత్వం అతన్ని అందరికంటే ప్రత్యేకంగా నిలబెట్టింది,” అని చెప్పి అమీర్ కోహ్లీని మెచ్చుకున్నారు.
అంతేకాక, అమీర్ తన కెరీర్ హైలైట్ గురించి మాట్లాడుతూ, సచిన్ టెండూల్కర్‌ను అవుట్ చేయడాన్ని చాలా ప్రత్యేక క్షణంగా గుర్తు చేసుకున్నారు. “సచిన్ పాజీ వికెట్ తీసిన రోజును నేను ఎప్పటికీ మర్చిపోలేను,” అని అమీర్ అనుభూతిని పంచుకున్నారు.
క్రికెట్‌లో తన కీర్తిని పొందిన అమీర్ తన ఆఖరి పదచరణతో కూడా తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పి, విరాట్ కోహ్లీ స్థానం క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా ఉండేలా చేశారు.