IPL 2025: రాజస్థాన్ రాయల్స్‌కు పొంచి ఉన్న ప్రమాదాలు! ఆ బలహీనతలు ఏంటో చూడండి!
రాజస్థాన్ రాయల్స్ తక్కువ బడ్జెట్ కారణంగా బ్యాటింగ్ బ్యాకప్‌లు, నిజమైన ఆల్-రౌండర్ లేమి, గాయం సమస్యలతో కూడిన విదేశీ బౌలర్లపై ఆధారపడటం వంటి సమస్యలను ఎదుర్కొంటోంది. ఈ బలహీనతలు వారికి సీజన్‌లో ప్రతికూల ప్రభావం చూపవచ్చు. ఈ మూడు ప్రధాన సమస్యలను రాజస్థాన్ రాయల్స్ పరిష్కరించగలిగితేనే వారు సీజన్‌లో విజయవంతం అవుతారు.
రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ 2025 వేలానికి ముందు ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడంతో వేలం సమయంలో తక్కువ బడ్జెట్‌తో రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఈ పరిస్థితి కొంతమంది నాసిరకం ఆటగాళ్లను ఎంపిక చేయడానికి దారి తీసింది. జట్టు కొంతమందిని మంచి ఆటగాళ్లతో నింపినా, జట్టు ఇప్పటికీ కొన్ని ప్రధాన బలహీనతలతో ఉంది.
1. బ్యాటింగ్ లో బ్యాకప్
బ్యాటింగ్ విభాగంలో బ్యాకప్‌లు లేకపోవడం ప్రధాన సమస్య. ఫస్ట్-చాయిస్ బ్యాటర్లకు ప్రత్యామ్నాయంగా సరైన బ్యాటర్లు లేకపోవడం జట్టులో గాయాలు అయినా లేదా ఏ బ్యాటర్ అయిన ఫామ్ కోల్పోయే సందర్భం వస్తే పెద్ద సమస్యగా మారవచ్చు.
2. సరైన ఆల్-రౌండర్ లోపం
మరో ముఖ్యమైన అంశం జట్టులో నికార్సైన ఆల్-రౌండర్ లేకపోవడం. ఆల్-రౌండర్ల విలువ కొంత తగ్గినా, జట్టును సమతుల్యం చేయగల ఆటగాళ్ల కొరత స్పష్టంగా కనిపిస్తుంది.
3. గాయాల బారినపడే అవకాశం ఉన్న విదేశీ బౌలర్లు
విదేశీ బౌలర్ల విషయంలో జోఫ్రా ఆర్చర్, వనిందు హసరంగా ఇద్దరు అద్భుతమైన ప్రతిభ కలిగినవారైనా, గాయాల సమస్యలతో వీరు ఎప్పుడైనా అందుబాటులో ఉనకపోవచ్చు. వీరి గైర్హాజరీ జట్టు బౌలింగ్‌ను బలహీనపరుస్తుంది. ఈ మూడు ప్రధాన సమస్యలను రాజస్థాన్ రాయల్స్ పరిష్కరించగలిగితేనే వారు సీజన్‌లో విజయవంతం అవుతారు.