Rohit Sharma: శుభ్‌మన్ గిల్ లేడి అభిమానిపై మండిపడ్డ రోహిత్! చివరకు రియాక్షన్ చూడండి. వీడియో వైరల్!
మెల్‌బోర్న్ ప్రాక్టీస్ సమయంలో శుభ్‌మన్ గిల్ లేడి అభిమాని అభ్యర్థనతో రోహిత్ చిరాకుపడ్డాడు. చివరకు ఎక్కడినుండి తీసుకురావాలి అని సమాధానమిచ్చాడు. గిల్, జైస్వాల్, పంత్ ఫామ్ లేమితో ఇబ్బందులు పడుతున్నా, రోహిత్ మాత్రం ఈ త్రయంపై పూర్తి నమ్మకం ఉంచి, వారి మానసిక స్థితి మలుపు తిప్పాలని భావిస్తున్నారు.. రాబోయే మ్యాచ్‌లలో ఈ యువ ఆటగాళ్ల ప్రదర్శన కీలకం.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో బాక్సింగ్ డే మ్యాచ్‌కు ముందు మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఒక ప్రత్యేక సంఘటనకు ఎదుర్కొన్నాడు. ప్రాక్టీస్ ముగిసిన వెంటనే, ఒక మహిళా అభిమాని రోహిత్‌ను శుభ్‌మన్ గిల్‌ను పిలవమని అడగడంతో మొదట సైగతో సరిపెట్టిన రోహిత్, చివరకు చిరాకుతో “ఎక్కడినుండి తీసుకురావాలి” అంటూ స్పందించాడు.
ఇది మాత్రమే కాదు, ఈ సిరీస్‌లో రోహిత్ తన టీమ్ గురించి కూడా ఆందోళన వ్యక్తం చేశారు. గిల్, జైస్వాల్, పంత్‌ల త్రయం తమ ఫామ్‌ను నిలబెట్టుకోవడంలో విఫలమవుతున్నా, కెప్టెన్ రోహిత్ వారికి అనవసరమైన భారం వేయకుండా, వారి ఆటను నడిపించేందుకు వీలుగా ప్రోత్సహిస్తున్నారు.
జైస్వాల్ తన తొలి ఇన్నింగ్స్‌లో చేసిన ప్రదర్శన మెప్పించినా, బ్రిస్బేన్, అడిలైడ్ టెస్టుల్లో పెద్ద స్కోర్ల కోసం ప్రయత్నిస్తున్నారు. మరోవైపు, గిల్, పంత్‌లు మంచి ఆరంభాలు అందించినా, వాటిని నిలబెట్టుకోలేకపోతున్నారు. రోహిత్ మాత్రం ఈ త్రయంపై పూర్తి నమ్మకం ఉంచి, వారి మానసిక స్థితి మలుపు తిప్పాలని భావిస్తున్నారు.
Rohit Sharma be like – kahan se bulaun 😂#RohitSharma𓃵 #ShubmanGill pic.twitter.com/YzwzGg9nQh
— रोहित जुगलान Rohit Juglan (@rohitjuglan) December 24, 2024