AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND Vs AUS: టీమిండియా జట్టులో కీలక అప్డేట్.. రేపటి టెస్టులో ఓపెనింగ్ అతనే?

బోర్డర్ - గవాస్కర్ టెస్ట్ సిరీస్ మూడు మ్యాచ్‌లు ముగిశాయి. తొలి మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించగా, రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. మూడో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇప్పుడు నాలుగో టెస్టుకు ఇరు జట్లు సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓపెనింగ్‌ రానున్నట్లు తెలుస్తుంది.

IND Vs AUS: టీమిండియా జట్టులో కీలక అప్డేట్.. రేపటి టెస్టులో ఓపెనింగ్ అతనే?
Rohit Sharmawill Open For Team India
Velpula Bharath Rao
|

Updated on: Dec 25, 2024 | 2:55 PM

Share

ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్ వేదికగా జరగనున్న 4వ టెస్టు మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రదర్శనపై ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. పెర్త్ టెస్టులో రోహిత్ అందుబాటులో లేకపోవడంతో కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు. యశస్వి జైస్వాల్‌తో కలిసి కేఎల్ రాహుల్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు. దీంతో అడిలైడ్, బ్రిస్బేన్ టెస్టుల్లో రోహిత్ శర్మ మిడిల్ ఆర్డర్‌లో ఆడాడు.

మెల్‌బోర్న్ వేదికగా జరగనున్న బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌లో రోహిత్ శర్మ మళ్లీ ఓపెనర్‌గా ఆడాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. తద్వారా నాలుగో టెస్టు మ్యాచ్‌లో జైస్వాల్, రోహిత్ శర్మలు టీమిండియా ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రోహిత్ శర్మ ఓపెనింగ్ వస్తే కేఎల్ రాహుల్ స్థానంలో వస్తాడు?. మళ్లీ మునుపటిలా 6వ నంబర్‌లో బ్యాటింగ్ చేయాల్సి వస్తుంది.

అద్భుతమైన ఫామ్‌లో ఉన్న కేఎల్ రాహుల్ మూడు మ్యాచ్‌ల్లో 235 పరుగులు చేశాడు. దీంతో ఈ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా కేఎల్ రాహుల్ నిలిచాడు. ఇప్పుడు పేలవ ఫామ్‌లో ఉన్న రోహిత్ శర్మ కోసం కేఎల్ రాహుల్ తన ఆర్డర్‌ను మార్చుకోనున్నట్లు తెలుస్తుంది. అయితే ఇది రాహుల్ ఫామ్‌పై ప్రభావం చూపుతుందేమో అనేది  చూడాలి.

బాక్సింగ్ డే టెస్ట్ అంటే ఏమిటి?

క్రిస్మస్ మరుసటి రోజు జరిగే టెస్ట్ మ్యాచ్‌ను బాక్సింగ్ డే టెస్ట్ అంటారు. దీనికి ప్రధాన కారణం క్రిస్మస్ రోజున వచ్చిన గిఫ్ట్ బాక్సులను మరుసటి రోజు అంటే డిసెంబర్ 26న తెరవడమే. అందుకే పెట్టె తెరిచే రోజునే బాక్సింగ్ డే అంటారు. అదే రోజు నిర్వహించే టెస్ట్ మ్యాచ్‌లను బాక్సింగ్ డే టెస్టులు అంటారు.

మ్యాచ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది?

బాక్సింగ్ డే టెస్ట్ ఉదయం 5 గంటలకు IST ప్రారంభమవుతుంది. మొదటి సెషన్ సాయంత్రం 5 గంటలకు ప్రారంభమై రాత్రి 7 గంటల వరకు కొనసాగుతుంది. రెండవ సెషన్ ఉదయం 7.40 నుండి 9.40 IST వరకు జరుగుతుంది. అలాగే, మూడో సెషన్ ఉదయం 10 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగుతుంది. అయితే కేఎల్ రాహుల్ 3వ స్థానంలో వస్తాడని, టీమిండియా ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి. తెలుగు తేజం నితీశ్ కుమార్ స్థానంలో సుందర్ వస్తారని తెలుస్తుంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి