AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: టీమిండియా భవిష్యత్తు పాక్ చేతిలోనే.. ఆ రెండు మ్యాచులు గెలిస్తేనే ఫైనల్‌కి..

భారత్, ఆస్ట్రేలియాతో పాటు పాకిస్థాన్, దక్షిణాఫ్రికా మధ్య కూడా డిసెంబర్ 26 నుంచి టెస్టు మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. సొంత మ్యాచ్‌తో పాటు పాకిస్థాన్‌ జట్టు కూడా మ్యాచ్‌లు గెలవాలని టీమిండియా అభిమానులు ప్రార్థించవలసిన పరిస్థితి వచ్చింది. అసలు విషయం ఏంటంటే?

Team India: టీమిండియా భవిష్యత్తు పాక్ చేతిలోనే.. ఆ రెండు మ్యాచులు గెలిస్తేనే ఫైనల్‌కి..
Team India Pray For Pakistan Win Against South Africa For Wtc Final Qualification
Velpula Bharath Rao
|

Updated on: Dec 25, 2024 | 3:37 PM

Share

భారత్-పాక్ జట్ల మధ్య పోరు అంటే ఫ్యాన్స్ ఓ యుద్దంలా భావిస్తూ ఉంటారు. అయితే టీమిండియా అభిమానుల ఎప్పుడు పాక్ ఓడిపోవాలని కోరుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు టీమిండయా ఫ్యాన్ మాత్రం పాక్ గెలవాలని ప్రార్థించవలసిన పరిస్థితి వచ్చింది. WTC ఫైనల్‌కి భారత్ చేరడం కష్టంగా కనిపిస్తోంది. అయితే వచ్చే రెండు టెస్టుల్లో పాక్‌ జట్టు దక్షిణాఫ్రికాపై గెలిస్తే ఈ మార్గం సులభమవుతుంది.

పాక్ గెలిస్తే ఏమవుతుంది?

భారత జట్టు నేరుగా డబ్ల్యూటీసీ ఫైనల్స్‌కు అర్హత సాధించాలంటే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించాల్సి ఉంటుంది. అయితే ఈ రెండు మ్యాచ్‌లు గెలవడం అంత సులభం కాదు. ఒక్క మ్యాచ్‌లో ఓడినా, డ్రా అయినా టీమిండియా ఫైనల్‌ ఆడడం కష్టమే. అందుకే భారత్‌కు పాక్ సహాయం కావాలి. ప్రస్తుతం దక్షిణాఫ్రికా జట్టు 63.33 శాతం పాయింట్లతో రేసులో ముందంజలో ఉంది. దక్షిణాఫ్రికాతో పాకిస్థాన్‌ 2 టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. ఇందులో ఒక్క మ్యాచ్‌ అయినా  దక్షిణాఫ్రికా గెలిస్తే ఫైనల్‌కు టిక్కెట్‌ కన్ఫర్మ్ అవుతుంది. అందువల్ల దక్షిణాఫ్రికాపై పాక్ జట్టు 2-0తో గెలిస్తే.. టీమిండియాకు ఫైనల్ ఆడే అవకాశాలు పెరుగుతాయి.

ఇది చదవండి: టీమిండియా జట్టులో కీలక అప్డేట్.. రేపటి టెస్టులో ఓపెనింగ్ అతనే?

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని భారత జట్టు 2-1తో కైవసం చేసుకుంటే.. అప్పుడు పాకిస్థాన్ జట్టు కనీసం 1-0తో దక్షిణాఫ్రికాను ఓడించాలి. అలాగే ఆస్ట్రేలియా జట్టును 1-0ను శ్రీలంక ఓడించాలి. ఒకవేళ టీమ్ ఇండియా 2-2తో సిరీస్‌ను డ్రా చేసుకుంటే దాని శాతం పాయింట్లు 55.26గా ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ ఫైనల్‌కు చేరుకోవాలంటే దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్‌ను 2-0 తేడాతో పాక్ జట్టు కైవసం చేసుకోవడం తప్పనిసరి. భారత్-ఆస్ట్రేలియా సిరీస్ 1-1తో డ్రాగా ముగిస్తే.. అప్పుడు భారత్ 53.51 శాతం పాయింట్లను కలిగి ఉంటుంది.

ఆసీస్‌తో సిరీస్ ఓడిపోతే భారత్ ఫైనల్‌కు చేరుతుందా?

భారత్ ఫైనల్‌కి వెళ్లాలంటే దక్షిణాఫ్రికాతో జరిగే రెండు మ్యాచ్‌ల్లోనూ పాకిస్థాన్ గెలవాల్సి ఉంటుంది. అంతే కాకుండా శ్రీలంక జట్టు ఆస్ట్రేలియాను 1-0తో ఓడించాలి లేదా సిరీస్‌ను 0-0తో డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ భారత జట్టు ఆసీస్‌తో సిరీస్  ఓడిపోతే దాదాపుగా WTC నుంచి నిష్క్రమించినట్టే.. అప్పుడు పాకిస్థాన్ 2-0తో విజయం సాధించడం కూడా పెద్దగా ఉపయోగపడదు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి