Vinod Kambli: ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన.. ఆర్థిక సాయంతో పాటు..
టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఇటీవల మళ్లీ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ప్రస్తుతం అతను థానేలోని ఆకృతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాంబ్లీ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ క్రమంలో క్రికెట్ అభిమానులు కాంబ్లీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఆరోగ్యం నిలకడగా ఉంది. అతను క్రమంగా కోలుకుంటున్నాడని వైద్యులు తెలిపారు. తీవ్రమైన మూత్రనాళ ఇన్ఫెక్షన్ కారణంగా కాంబ్లీని థానేలోని ఆకృతి హాస్పిటల్‌లో చేర్పించారు. తదనంతర వైద్య పరీక్షల్లో అతని మెదడు రక్తనాళాల్లో రక్తం గడ్డకడుతోందని తేలడంతో ఐసీయూలోనే ఉంచి చికిత్స అందిస్తున్నారు. డాక్టర్ వివేక్ త్రివేది నేతృత్వంలోని ప్రత్యేక వైద్యబృందం అతన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. కాగా వినోద్ కాంబ్లీ చికిత్స కోసం ఆసుపత్రిలో చేరినట్లు తెలుసుకున్న మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే క్రికెటర్ కు ఆర్థిక సహాయం ప్రకటించారు. ఏకనాథ్ షిండే కుమారుడు, కళ్యాణ్ లోక్‌సభ ఎంపీ శ్రీకాంత్ షిండే కాంబ్లీకి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. డాక్టర్ శ్రీకాంత్ షిండే ఫౌండేషన్ ద్వారా ఈ సాయం అందజేస్తామని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తనకు ఆర్థిక సాయం ప్రకటించిన ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశాడు కాంబ్లీ. ఇదిలా ఉంటే శివసేన నాయకుడు, రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్నాయక్ కాంబ్లీ ఆరోగ్య పరిస్థితిపై స్పందించారు. ఇటీవల ఆయన మీడియాతో ముచ్చటించారు. ఈ సమయంలో వినోద్ కాంబ్లీ ఆరోగ్యం గురించి అడిగారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని పాత జ్ఞాపకాలను కూడా గుర్తు చేసుకున్నారు. అలాగే వినోద్ కాంబ్లీకి పూర్తి చికిత్స అందించే బాధ్యతను తీసుకున్నామని ప్రతాప్ సర్నాయక్ తెలిపారు.
‘వినోద్ కాంబ్లీ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు చాలా బాగుంది. మాకు ఓ సేవా సంస్థ ఉంది. ఈ సంస్థ ప్రతి నెల లేదా రెండు నెలలకు ఓసారి ఎ అవసరమైన వారికి సహాయం అందజేస్తున్నాం. ఈ సంస్థ ద్వారా 20 లక్షలు వసూలు చేశాం. కాంబ్లీకి పూర్తిగా చికిత్స చేసే బాధ్యతను తీసుకున్నాం. గంగూబాయి శంభాజీ షిండే హాస్పిటల్, ఇందిరాబాయి బాబూరావ్ సర్నాయక్, అకృతి హాస్పిటల్ అనే మూడు ఆసుపత్రులు వినోద్ కాంబ్లీకి చికిత్స అందజేస్తాయి. కాంబ్లీ 93-94లో వివాహం చేసుకున్నాడు. అతను మొదటి పెళ్లి రోజును నా ఫామ్‌హౌస్‌లో జరుపుకున్నాడు. కానీ అతను కొన్ని అనవసరమైన తప్పులు చేసాడు, ఇప్పుడు బాధపడుతున్నాడు. ఇప్పుడు మళ్లీ ఇలాంటి తప్పు జరగదని కాంబ్లీ చెప్పాడు’’ అని ప్రతాప్ సర్నాయక్ చెప్పుకొచ్చారు.
ఆకృతి ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ..
VIDEO | Former Indian cricketer Vinod Kambli was admitted to Akruti Hospital, a private facility in Thane, Maharashtra, on Saturday, December 21, after his health condition deteriorated.
The 52-year-old was brought to the hospital by one of his fans who also owns the hospital in… pic.twitter.com/128LnbYkcu
— Press Trust of India (@PTI_News) December 23, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..