AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: హార్దిక్ బాటలోనే మరో టీమిండియా క్రికెటర్.. భార్యతో విడాకులు! నాలుగేళ్ల వైవాహిక బంధానికి స్వస్తి!

టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా, బాలీవుడ్ నటి నటాషా స్టాంకోవిచ్ ఈ ఏడాది విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు మరో స్టార్ క్రికెటర్ తన భార్యతో విడిపోతున్నాడనే ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు బాలీవుడ్ నిర్మాత ఒకరు షేర్ చేసిన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

Team India: హార్దిక్ బాటలోనే మరో టీమిండియా క్రికెటర్.. భార్యతో విడాకులు! నాలుగేళ్ల వైవాహిక బంధానికి స్వస్తి!
Team India Cricketers
Basha Shek
|

Updated on: Dec 24, 2024 | 8:29 PM

Share

ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్‌ను టీమిండియా కైవసం చేసుకుంది. ఆ వెంటనే టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా సంచలన ప్రకటన చేశాడు. నటాషా స్టాంకోవిచ్‌తో విడాకులు తీసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. వరల్డ్ కప్ ప్రారంభం కాకముందే వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే టీ20 ప్రపంచకప్ అయిన తమ విడాకుల నిర్ణయాన్ని ప్రకటించారు హార్దిక్- నటాషా. ఇప్పుడు టీమిండియాకు చెందిన మరో స్టార్ క్రికెటర్ విడాకులు తీసుకోనున్నాడనే టాక్ వినిపిస్తోంది. అతను మరెవరో కాదు టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజువేంద్ర చాహల్. ఇప్పటికే టీమ్ ఇండియాకు దూరమైన చాహల్ వ్యక్తిగత జీవితంలోనూ తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నాడని తెలుస్తోంది. తన భార్య ధన్‌శ్రీ వర్మతో మనస్పర్థలు తలెత్తినట్లు తెలుస్తోంది. యుజువేంద్ర-ధన్‌శ్రీల వివాహం జరిగి డిసెంబర్ 22 నాటికి నాలుగేళ్లు పూర్తయ్యాయి. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే వీరిద్దరూ కనీసం వెడ్డింగ్ యానివర్సరీ పోస్టులు కానీ విషెస్ కానీ చెప్పుకోలేదు. దీంతో వీరిద్దరూ విడిపోతారని ప్రచారం జరుగుతోంది. ఇదే కాదు గత కొన్ని రోజులుగా చాహల్- ధనశ్రీ సోషల్ మీడియా పోస్టులు వీరి విడాకుల వార్తలకు బలాన్ని చేకూరుస్తున్నాయి.

2020లో కరోనా వైరస్ కారణంగా దేశమంతా లాక్‌డౌన్ విధించారు. అదే సమయంలో స్టార్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ధనశ్రీకి పరిచయమయ్యాడు. ఇద్దరూ ముచ్చటపడి 2020 డిసెంబర్ 22న పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి చాలా అన్యోన్యంగా జీవించారు. పెళ్లి రోజు, పుట్టిన రోజు వేడుకల సందర్భంగా సోషల్ మీడియా పోస్ట్‌ల ద్వారా ఒకరిపై మరొకరు తమ ప్రేమను చాటుకున్నారు. అయితే ఈ ఏడాది ధన్‌శ్రీ కానీ, చాహల్ కానీ అలాంటివేమీ చేయలేదు. డిసెంబర్ 22, 2024 వారి నాల్గవ వివాహ వార్షికోత్సవం. అయితే వీరిద్దరూ సోషల్ మీడియాలో ఎలాంటి విషెస్ పోస్ట్ చేయలేదు.

ఇవి కూడా చదవండి

భార్య ధనశ్రీతో కలిసి చాహల్..

వెడ్డింగ్ యానివర్సరీకి ఒకరికొకరు విష్ చేసుకోకపోవడం వల్లే వీరిద్దరూ విడిపోబోతున్నారనే రూమర్లు ఊపందుకున్నాయి. ఎందుకంటే ఇద్దరూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. అలాంటప్పుడు సోషల్ మీడియా ద్వారా విష్ చేయకుంటే అనుమానం వస్తుంది. ఇక బాలీవుడ్ నిర్మాత, సినీ విమర్శకుడు కమల్ ఆర్ ఖాన్ చాహల్- ధనశ్రీ విడిపోయారంటున్నాడు. KRK డిసెంబర్ 22 న ఒక పోస్ట్ చేసారు. అందులో ‘చాహల్ ధన‌శ్రీల వైవాహిక బంధం ఎక్కువ కాలం ఉండదని నాకు మొదటి నుండి తెలుసు. ఇప్పుడు ఇద్దరూ విడిపోయారు’ అని అందులో రాసుకొచ్చాడు.

KRK చెప్పిన దాంట్లో ఎంత నిజం ఉందో తెలుసుకోవడం కష్టం. అయితే గత కొన్ని నెలల్లో ధనశ్రీ , చాహల్‌ల సోషల్ మీడియా పోస్టులు చూస్తుంటే కేఆర్ కే వాదనకు బలం చేకూరుస్తున్నాయి. గత కొన్ని వారాలుగా వీరిద్దరూ కలిసి ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు. ధనశ్రీ చివరిసారిగా ఆగస్టు 25న చాహల్‌తో దిగిన ఫోటోను పోస్ట్ చేసింది. ఇక సెప్టెంబరు 27న ధన‌శ్రీ పుట్టినరోజు సందర్భంగా చాహల్ ఒక ఫోటో పోస్ట్ చేసి శుభాకాంక్షలు తెలిపాడు. ఇది మాత్రమే కాదు, గత కొన్ని రోజులుగా చాహల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని పోస్ట్‌లను పోస్ట్ చేస్తున్నాడు, ఇది అతను ఒంటరిగా ఉన్నట్లు సూచిస్తుంది. చాహల్‌కి సంబంధించిన ఏ ఫోటోకు కూడా ధన‌శ్రీ స్పందించలేదు. చాహల్ కూడా ధనశ్రీ ఫొటోలకు అసలు రియాక్ట్ అవ్వడం లేదు. మరి వీరు నిజంగానే విడిపోతున్నారా? లేదా ఇవి ఒట్టి రూమర్లేనా? అన్నది చాహల్, ధనశ్రీలే చెప్పాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..