Shyam Benegal: సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత.. ప్రముఖుల నివాళి

సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు శ్యామ్‌ బెనగల్‌ (90) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన కాసేపటి క్రితమే తుది శ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు శ్యామ్ బెనగల్ కు నివాళి అర్పిస్తున్నారు.

Shyam Benegal: సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత.. ప్రముఖుల నివాళి
Shyam Benegal
Follow us
Basha Shek

|

Updated on: Dec 23, 2024 | 8:59 PM

లెజెండరీ దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత శ్యామ్ బెనగల్ (90) కన్ను మూశారు. గత కొన్ని రోజులుగా వృద్ధాప్య సమస్యలకు తోడు అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన కాసేపటి క్రితమే తుదిశ్వాస విడిచారు. ముంబైలోని ఓ హాస్పిటల్‌లో ఆయన కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆస్పత్రి వైద్యులు ధ్రువీకరించారు. హైదరాబాద్‌ తిరుమలగిరిలో 1934 డిసెంబర్‌ 14న శ్యామ్ బెనగల్ జన్మించారు.  సికింద్రాబాద్‌ మహబూబ్‌ కాలేజీలో విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఉస్మానియా వర్సిటీలో ఎంఏ చదివారు. సత్యజిత్‌రే తర్వాత ఆర్ట్‌ ఫిల్మ్స్‌లో  సత్తా చాటిన దర్శకులలో శ్యామ్ బెనగల్ ఒకరు. అంకుర్‌, నిశాంత్‌, మంథన్‌ సినిమాలు తీసిన బెనగల్‌ వంటి ఎన్నో అవార్డు సినిమాలను తెరకెక్కించి దిగ్గజ దర్శకునిగా గుర్తింపు పొందారు. తన ప్రతిభకు ప్రతీకగా పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులతో పాటు ఏడుసార్లు జాతీయ అవార్డు కూడా అందుకున్నారీ లెజెండరీ డైరెక్టర్. 2003లో ఇందిరాగాంధీ జాతీయ సమైక్యతా పురస్కారం, 2013 లో ప్రఖ్యాత అక్కినేని నాగేశ్వరరావు అవార్డు, దాదా సాహెబ్‌ ఫాల్కే.. ఇలా ఎన్నో ప్రతిష్టాత్మక పురస్కారాలు శ్యామ్ బెనగల్ కీర్తి కిరీటంలో ఉన్నాయి. సినిమాలో దిగ్గజ దర్శకునిగా గుర్తింపు పొందిన ఆయన రాజ్యసభ సభ్యుడిగా కూడా పని చేశారు.

కాగా శ్యామ్ బెనగల్ గత కొద్ది కాలంగా వృద్దాప్య సమస్యలతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే సోమవారం తుది శ్వాస విడిచారు. కాగా ఈ శ్యామ్ మరణ వార్త తెలుసుకున్న పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు నివాళి అర్పిస్తున్నారు. సినిమా రంగానికి ఆయన చేసిన సేవలను స్మరించుకుంటున్నారు.

ప్రముఖల నివాళి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి