Keerthy Suresh: పెళ్లి తర్వాత కీర్తి సురేష్ సంచలన నిర్ణయం! నిరాశలో అభిమానులు!

మహానటి కీర్తి సురేష్ ఇటీవలే మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్టింది. తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోని తట్టిల్‌ తో కలిసి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టింది. వీరి పెళ్లి ఫోటోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే కీర్తి సురేశ్ కు సంబంధించిన ఒక వార్త వైరల్ గా మారింది.

Keerthy Suresh: పెళ్లి తర్వాత కీర్తి సురేష్ సంచలన నిర్ణయం! నిరాశలో అభిమానులు!
Keerthy Suresh
Follow us
Basha Shek

|

Updated on: Dec 23, 2024 | 7:23 PM

పెళ్లయ్యాక సినిమా ఇండస్ట్రీకి దూరమైనవాళ్లు చాలా మంది ఉన్నారు. పెళ్లయ్యాక కొంత మంది సినీ పరిశ్రమ నుంచి తప్పుకుంటే మరికొందరు పెళ్లి, పిల్లలైనా సినిమాలు చేస్తున్నారు. అలియా భట్, ఐశ్వర్యారాయ్ వంటి నటీమణులు పెళ్లి తర్వాత కూడా చిత్ర పరిశ్రమలో విజయవంతంగా కొనసాగిన ఉదాహరణలు చాలా ఉన్నాయి. అయితే మహానటి కీర్తి సురేష్ ఇప్పుడు ఏ మార్గాన్ని ఎంచుకుంటుందనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం కీర్తి సురేష్ చేతిలో ‘రివాల్వర్ రీటా’, ‘కన్నీవేది’ సినిమాలు ఉన్నాయి. దీంతో పాటు ‘బేబీ జాన్’ సినిమాపై అంచనాలు పెరిగాయి. అయితే వీటి తర్వాత కీర్తి తన కొత్త సినిమా ఏదీ ప్రకటించలేదు. ఇదే ఇప్పుడు పలు సందేహాలకు తావిస్తోంది. నటన నుంచి కీర్తి బ్రేక్‌ తీసుకుంటుందా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. మరోవైపు ఇది కేవలం రూమర్ మాత్రమేనని సినీ వర్గాలు చెబుతున్నాయి. పెళ్లయిన కొద్ది రోజులకే కీర్తి సురేష్ సినిమా ప్రమోషన్స్ కోసం వెళ్లింది. సినిమాపై ఆమెకున్న ప్రేమను ఇది తెలియజేస్తుంది. ఆంటోని కూడా కీర్తి సురేష్ సినిమా కెరీర్‌కు అండగా ఉంటాడని కోలీవుడ్ మీడియా చెబుతోంది.

మహానటి సినిమాతో జాతీయ అవార్డు అందుకున్న కీర్తి సురేశ్ కు సినీ పరిశ్రమలో మంచి డిమాండ్ ఉంది. అయితే సినిమా కెరీర్ పీక్స్ లో ఉండగానే ఆమె వివాహం చేసుకుంది. అయితే ఇది కీర్తి సినిమా కెరీర్ పై ఏ మాత్రం ప్రభావం చూపదని తెలుస్తోంది. అలియా భట్, ఐశ్వర్య సహా చాలా మంది నటీమణులు పెళ్లి తర్వాత కూడా చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నారు. కీర్తి సురేష్ కూడా వీరి బాటలోనే నడుస్తుందని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

కాగా ఇప్పటికే దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోన్న కీర్తి సురేశ్ ఇప్పుడు బాలీవుడ్ లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఆమె నటించిన మొదటి హిందీ సినిమా బేబీ జాన్ క్రిస్మస్‌ కానుకగా ఈ నెల 25న విడుదల కానుంది. ఇందులో వరుణ్‌ ధావన్‌ హీరోగా నటించాడు.

 బేబీ జాన్ సినిమాలో కీర్తి సురేశ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

చలికాలంలో ఇలా చేస్తే చక్కని ఆరోగ్యం మీ సొంతం !!
చలికాలంలో ఇలా చేస్తే చక్కని ఆరోగ్యం మీ సొంతం !!
కొత్త బట్టలు ఉతక్కుండా వేసుకుంటున్నరా.. జాగ్రత్త
కొత్త బట్టలు ఉతక్కుండా వేసుకుంటున్నరా.. జాగ్రత్త
నాగుపాము తలపై నిజంగానే మణి ఉంటుందా.. నిజమెంత ??
నాగుపాము తలపై నిజంగానే మణి ఉంటుందా.. నిజమెంత ??
మహిళలూ మీ రవికలు జాగ్రత్త.. వీడి చేతికి దొరికితే అంతే సంగతులు
మహిళలూ మీ రవికలు జాగ్రత్త.. వీడి చేతికి దొరికితే అంతే సంగతులు
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!