AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Soniya Akula: బిగ్ బాస్ సోనియా పెళ్లి.. పుష్ప రాజ్ తరహాలో బౌన్సర్లతో వచ్చిన పల్లవి ప్రశాంత్.. వీడియో ఇదిగో

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కంటెస్టెంట్ సోనియా ఆకుల ఇటీవలే తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టింది. తన ప్రియుడితో కలిసి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టింది. పలువురు బుల్లితెర ప్రముఖులు, బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు.

Soniya Akula: బిగ్ బాస్ సోనియా పెళ్లి.. పుష్ప రాజ్ తరహాలో బౌన్సర్లతో వచ్చిన పల్లవి ప్రశాంత్.. వీడియో ఇదిగో
Bigg Boss Sonia Marriage
Basha Shek
|

Updated on: Dec 22, 2024 | 8:06 PM

Share

బిగ్ బాస్ తెలుగు ఫేమ్ సోనియా ఆకుల పెళ్లి ఇటీవల ఘనంగా జరిగింది. తన ప్రియుడు యష్ వీరగోనితో కలిసి ఆమె ఏడడుగులు వేసింది. హైదరాబాద్ వేదికగా జరిగిన సోనియా వివాహానికి పలువురు బుల్లితెర ప్రముఖులు, బిగ్ బాస్ కంటెస్టెంట్స్ హాజరయ్యారు. నూతన వధూవరులను మనసారా ఆశీర్వదించారు. సోనియా పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఇక బిగ్ బాస్ గత సీజన్ విజేత రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ సోనియా పెళ్లికి రాకపోయినా రిసెప్షన్ కు హాజరయ్యారు. కొత్త జంటను అశీర్వదించాడు. అయితే ఎప్పటిలాగే హంగామా చేశాడు రైతు బిడ్డ. సోనియా పెళ్లికి ఏకంగా ముగ్గురు బౌన్సర్లతో హాజరయ్యారు. ఈ మేరకు తన గ్రాండ్ ఎంట్రీ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. అందులో ప్రశాంత్‌ చుట్టూ ముగ్గురు బౌన్సర్లు పెళ్లికి వచ్చిన అతిథులను పక్కకు పంపిస్తూ ముందుకు సాగారు. ఇక సోనియా దంపతులను కలిసిన పల్లవి ప్రశాంత్ కొత్త జంటతో కలిసి సరదాగా ఫొటోలు దిగారు. అనంతరం అక్కడే ఉన్న బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరినీ పలకరించాడు. విందు కూడా స్వీకరించాడు. కాగా ఈ వీడియోకు పుష్ప 2 సినిమాలోని గంగో రేణుక తల్లి పాటను జత చేయడం గమనార్హం. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఇది మరీ ఓవర్ బ్రో’ అంటూ ప్రశాంత్ ను ట్రోల్ చేస్తున్నారు.

ఇక సోనియా పెళ్లిలో జెస్సీ, అమర్ దీప్, తేజస్విని, బేబక్క, రోహిణి, టేస్టీ తేజ, భోలే షావలి, కిర్రాక్ సీత, యష్మి, ఆదిత్య ఓం తదితరులు సందడి చేశారు. సోనియా ఆకుల పెళ్లి వేడుకలో మాత్రం నిఖిల్, పృథ్వీ మాత్రం కనిపించలేదు. దీంతో ఆ ఇద్దరు ఎందుకు రాలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. కాగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 తో మంచి గుర్తింపు తెచ్చుకున్న సోనియా సొంతూరు తెలంగాణలోని మంథని. సంచలన దర్శకుడు ఆర్జీవీ తెరకెక్కించిన కొన్ని సినిమాల్లో ఈ అందాల తార నటించింది. అయితే పెద్దగా గుర్తింపు రాలేదు. ఎప్పుడైతే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టిందో అప్పటి నుంచే ఆమె పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోయింది.

ఇవి కూడా చదవండి

సోనియా పెళ్లి వేడుకలో పల్లవి ప్రశాంత్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే