Pallavi Prashanth: రైతు బిడ్డ కాస్త రాయల్ బిడ్డ అయ్యాడు.. లుక్ మార్చేసిన పల్లవి ప్రశాంత్.. ఫొటోస్ వైరల్
పాపం.. పల్లవి ప్రశాంత్ ఏం చేసినా కొందరు నెటిజన్లు అదే పనిగా అతనిని ట్రోల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టినా అదే పనిగా నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు. తాజాగా తన లుక్ ను పూర్తిగా మార్చేసిన ఫొటోలను నెట్టింట షేర్ చేశాడు పల్లవి ప్రశాంత్. ఇంకేముంది ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు ట్రోలర్స్.
‘మల్లోచ్చినా’ అంటూ రైతు బిడ్డ ట్యాగ్ తో బిగ్ బాస్ తెలుగు సీజన్ లోకి అడుగు పెట్టారు పల్లవి ప్రశాంత్. కామన్ మ్యాన్ కేటగిరిలో హౌస్ లోకి అడుగు పెట్టిన అతను ఏకంగా బిగ్ బాస్ టైటిల్ నే ఎగరేసుకుపోయాడు. ఇందుకు చాలా కారణాలున్నాయి. తన అమాయకమైన మాటతీరు చాలామందికి నచ్చింది. ఇక ఫిజికల్ టాస్కుల్లో అయితే రెచ్చిపోయాడు. వీటన్నిటికంటే ప్రధాన కారణం ఇంకోటుంది. అదే బిగ్ బాస్ టైటిల్ గెలిస్తే వచ్చిన ప్రైజ్‌మనీతో రైతులకు సాయం చేస్తానని అందరి ముందు మాటిచ్చాడు. కానీ ఈ మాటను పల్లవి ప్రశాంత్ నిలబెట్టుకోలేదని తెలుస్తోంది. నెట్టింట తీవ్ర విమర్శలు రావడంతో అప్పట్లో ఒక పేద కుటుంబానికి రూ.1 లక్ష సాయం చేశాడు. తర్వాత మరో కుటుంబానికి లక్ష కంటే తక్కువే ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఆ తర్వాత రైతుల సాయం గురించి పూర్తిగా మర్చిపోయాడు పల్లవి ప్రశాంత్. ఈ విషయాన్నే పదే పదే గుర్తు చేస్తూ జనాలు రైతు బిడ్డను ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా అదే జరిగింది.
సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే పల్లవి ప్రశాంత్ ఇటీవల కొన్ని ఫొటోలు అందులో షేర్ చేశాడు. అందులో ప్రశాంత్ లుక్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. కలర్ ఫుల్ డ్రెస్‌లో చాలా స్టైలిష్ గా కనిపించాడు బిగ్ బాస్ విజేత. అందే ట్రోలర్లు రెచ్చిపోయారు. ‘ఈ సోకులకేం తక్కువ లేదు, ముందు ఇచ్చిన మాట ప్రకారం రైతులకు డబ్బులు పంచు’ అని నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ‘లుక్ మార్చేశావేంటన్నా..రైతు బిడ్డ కాస్త రాయల్ బిడ్డ అయ్యాడు’ అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
రాయల్ లుక్ లో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్..
View this post on Instagram
మొత్తానికి పల్లవి ప్రశాంత్ సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టినా వదలట్లేదు కొందరు నెటిజన్లు. ఇటీవల అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారంలోనూ రైతు బిడ్డ షేర్ చేసిన పోస్ట్ మిస్ ఫైర్ అయ్యింది.
పల్లవి ప్రశాంత్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
View this post on Instagram
పుష్ప 2 రిలీజ్ సందర్భంగా కేక్ కటింగ్ చేస్తోన్నపల్లవి ప్రశాంత్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.