Prabhakar: అఫీషియల్.. హీరోయిన్‌గా బుల్లితెర ప్రభాకర్ కూతురు.. ఫొటోస్ చూశారా? ఎంత క్యూట్‌గా ఉందో!
ఎన్నో సీరియల్స్‌లో అద్భతమైన పాత్రలు పోషించి బుల్లితెర మెగాస్టార్ గా పేరు తెచ్చుకున్నారు ప్రభాకర్. ఇక ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ కుమారుడు కుమారుడు చంద్రహాస్ ఇప్పటికే హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు కూతురు కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది.
బుల్లితెర నటుడు ప్రభాకర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. పలు టీవీ సీరియల్స్‌లో నటించి మెప్పించిన ఆయన బుల్లితెర మెగాస్టార్ గా మన్ననలు అందుకున్నారు. అలాగే ఆపరేషన్ దుర్యోధన, మైసమ్మ ఐపీఎస్ వంటి సినిమాల్లోనూ పవర్ ఫుల్ పాత్రలతో మెప్పించారు. ఇక ప్రభాకర్ సినీ వారసత్వాన్ని కొనసాగిస్తూ కుమారుడు చంద్రహాస్ కొన్ని రోజుల క్రితమే సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. అతను నటించిన మొదటి సినిమా రామ్ నగర్ బన్నీ అక్టోబర్ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చంద్రహాస్ డ్యాన్స్, యాక్టింగ్ కు మంచి మార్కులే పడ్డాయి. ఇప్పుడు ప్రభాకర్ కూతురు దివిజా ప్రభాకర్ కూడా సినిమాల్లోకి వచ్చేస్తోంది. హీరోయిన్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యింది. గురువారం (డిసెంబర్ 19) దివిజా ప్రభాకర్ డెబ్యూ మూవీ రామానాయుడు స్టూడియోలో లాంఛనంగా ప్రారంభమైంది. వెంకట రామయ్యగారి తాలూకా, కేరాఫ్ సీతారాంపురం పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో దినేశ్ హీరోగా నటిస్తున్నాడు.
ఎస్‌వీకే బ్యానర్ , కోమలి క్రియేషన్స్ పతాకం పై విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్,కోమలి ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సతీష్ ఆవాలా దర్శకత్వ బాధ్యతలు చూసుకోనున్నారు. ఇక హీరో హీరోయిన్లపై చిత్రించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రభాకర్ కెమెరా స్విచ్ ఆన్ చేసి సినిమా యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు మేకర్స్ తెలిపారు.
దివిజా ప్రభాకర్ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
View this post on Instagram
ఇక దివిజా ప్రభాకర్ విషయానికి వస్తే.. రామ్ నగర్ బన్నీ సినిమాకు నిర్మాతగా వ్యవహరించింది. తన సోదరుడి సినిమా కోసం విస్తృతంగా ప్రమోషన్లు నిర్వహించి వార్తల్లో నిలిచింది. ఇప్పుడు హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. ఇక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే దివిజ తనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటుంది.
దివిజా ప్రభాకర్ లేటెస్ట్ ఫొటోస్..
View this post on Instagram
ట్రెడిషినల్ చీరలో ప్రభాకర్ కూతురు..
Saree is not just an attire; it’s a love language.” #Sareevibes Divija Prabhakar 😘 pic.twitter.com/YX1rUVJi7H
— Beauty in SAREE (@BeautyInSaree) October 28, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.