Brahmamudi, December 20th Episode: ఏడుస్తూ కావ్యకు నిజం చెప్పిన రాజ్.. ఇక ప్రాబ్లమ్ సాల్వ్!
కావ్యకు నిజం చెప్పాలని దగ్గరవుతున్న రాజ్. కానీ అది చూసి అపర్ణ, కావ్యలు అపార్థం చేసుకుంటారు. కావ్య మీద ప్రేమ వచ్చిందని అందుకే దగ్గర అవ్వాలని చూస్తున్నాడని అనుకుంటారు. ఈ క్రమంలోనే కావ్య మీద పడిన రాజ్‌ని చూస్తారు ద్రాణి, ధాన్యలక్ష్మిలు. ఇదే ఛాన్స్ కదా అని ధాన్యలక్ష్మిని మరోసారి రెచ్చగొడుతుంది రుద్రాణి..
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. నా వల్ల నువ్వు చాలా మందితో మాటలు పడ్డావు. వాళ్ల ముందు నువ్వు గర్వంగా తల ఎత్తుకునేలా చేస్తాను. ఖచ్చితంగా ఎస్‌ఐ గానే తిరిగి వస్తానని అప్పూ అంటే.. ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నా. నువ్వు జాగ్రత్తగా ఉండమని కళ్యాణ్ అంటాడు. సరే నువ్వు ఒకసారి రావచ్చు కదా.. విజిటింగ్ హవర్స్ ఉంటాయి. నువ్వు కూడా రావచ్చు కదా.. ఏ నన్ను చూడాలని లేదా అని అప్పూ అంటుంది. పొట్టీ ఇక్కడ నేను చూసుకోవాల్సిన ముఖ్యమైన పని ఒకటి ఉందని కళ్యాణ్ అంటాడు. నా కన్నా అంత ముఖ్యమైన పని ఏముందని కళ్యాణ్ ఫోన్ పెట్టేస్తాడు. నా దగ్గర ఏమన్నా దాస్తున్నాడా అని అనుమానిస్తుంది అప్పూ. మరోవైపు కావ్య కిచెన్‌లో పని చేసుకుంటూ ఉంటుంది. అక్కడికి వచ్చిన రాజ్ ఏం చేస్తున్నావ్ కళావతి అని అడుగుతాడు. కావ్య జోకులు వేస్తూ.. ఉంటే రాజ్ నవ్వుతాడు. సరేలే మీకు ఏం కావాలో చెప్పమని కావ్య అడిగితే.. ఊరికే వచ్చానానని రాజ్ అంటాడు.
టీ పెట్టుకుంటున్న రాజ్..
కిచెన్ అంటేనే నచ్చని మీరు.. ఈ కిచెన్‌లోకి ఎందుకు వచ్చారో చెప్పమని కావ్య అడిగితే.. రాజ్ ఏదేదో మాట్లాడుతూ.. టీ కావాలని అడుగుతాడు. ఇప్పుడే కదా భోజనం చేశారు.. ఇప్పుడు టీ తాగుతారా అని కావ్య అడిగితే.. రాజ్ ఏదో మాట్లాడుతూ ఉంటూ టీ పెట్టుకుంటాడు. ఏంటో ఈ కొత్త కొత్త అలవాట్లు అని కావ్య అంటుంది. రాజ్ టీ పెడుతూ ఉండగా.. రాజ్ కిచెన్‌కి వచ్చి రేయ్ రాజ్ ఏం చేస్తున్నావని అడుగుతుంది. భోజనం చేసిన తర్వాత టీ తాగితే మంచిదని టీ పెట్టుకుంటున్నారని కావ్య అంటుంది. ఉండు నేను పెడతానులే అని టీ పెడుతుంది అపర్ణ. కావ్య గిన్నెలు కడుగుతుందని నేనే పెట్టుకుంటున్నానని రాజ్ అంటే.. ఏంటి నువ్వు కావ్య గురించి పాజిటివ్‌గా మాట్లాడుతున్నావా అని అపర్ణ షాక్ అవుతుంది.
మీ మధ్య ఏదో జరుగుతుంది..
మీతో ఇదే వచ్చింది.. ఏం మాట్లాడినా తప్పే అని రాజ్ అంటే.. నీలో మార్పు వచ్చే నాకు సంతోషమేనని రాజ్ అంటే.. ఏంటి అత్తయ్యా మీరు ఆయన్ని ఇలా తరిమేశారు? అని అడుగుతుంది కావ్య.. వాడి మీద నువ్వు మంత్రించిన నీళ్లు ఏమన్నా చల్లావా అని అపర్ణ అడుగుతుంది. అయ్యో రామా.. నేనా అని కావ్య అంటే అది కాదు.. నువ్వు అంటే అల్లంత దూరాన ఉండే వాడు.. ఇప్పుడు నీకు దగ్గరవుతున్నాడని అంటుంది. మీ ఇద్దరి మధ్య ఏదో జరుగుతుందని అపర్ణ అంటే.. నాకు కూడా కావాల్సింది అదేలే అని నవ్వుకుంటూ అపర్ణ వెళ్లిపోతుంది. ఆ తర్వాత కావ్య డెబ్ మీద బూజు దులుపుతూ కింద పడబోతుండగా రాజ్ వెళ్లి పట్టుకుంటాడు. ఆ తర్వాత కావ్య కావాలనే రాజ్‌ని ఆటపట్టిస్తుంది. కళావతి నేను నీకు ఏ విధంగా సహాయ పడగలను అని అడుగుతాడు రాజ్. ఏంటి ఇవాళ మీ పద్దతి మారింది.. నేను సీలింగ్ మొత్తం క్లీన్ చేయాలి అనుకుంటున్నా.. చేసి పెడతారా అని కావ్య అడుగుతుంది. నేను చేస్తానులే అని రాజ్ చేస్తాడు. కళావతి నీకు ఒక విషయం చెప్పాలి అని నసుగుతూ కావ్య మీద పడబోతాడు రాజ్.
ధాన్యలక్ష్మికి మరోసారి పొగ పెట్టిన రుద్రాణి..
అప్పుడే ధాన్యలక్ష్మి, రుద్రాణిలు వచ్చి చూసుకుంటూ వెళ్లిపోతారు. ఇక కావ్య కథ చెబుతూ ఉండగా.. రాజ్ బయటకు వెళ్లిపోతాడు. ఆ తర్వాత రుద్రాణి, ధాన్యలక్ష్మిలు ఒక చోట కూర్చొని.. ఏంటో ఈ ఇంట్లో ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారో ఏమీ అర్థం కావడం లేదు.. చూశావు కదా ఆ జంట పక్షుల రొమాంటిక్ సీన్. నాకే తల కొట్టేసినట్లు ఉందని రుద్రాణి అంటే.. అవును.. సమయం సందర్భం లేకుండా ఆ ముద్దూ ముచ్చట్లు ఏంటి? ఏమన్నా ఉంటే తలుపులు వేసుకోవాలి కదా అని ధాన్యలక్ష్మి అంటుంది. నీకు అలా అర్థమైందా.. నువ్వు కేవలం ఆ క్షణం కోసమే ఆలోచిస్తావా అని రుద్రాణి అంటే.. నాకేం అర్థం కావడం లేదు సరిగ్గా చెప్పమని ధాన్యలక్ష్మి అంటే.. వాళ్లిద్దరూ కలిసి పోతే మనం ఏమీ చేయలేం. ఇప్పుడు ఈ రాజ గార కూడా ఆ రాణీ వారికి దగ్గర అయిపోయాడు. కంపెనీ రాజ్ చేతిలో.. ఇల్లు మొత్తం కావ్య చేతిలో ఉంది. ఇద్దరూ ఒక్కటైపోతే.. వాళ్లిద్దరూ దుగ్గిరాల వంశాన్ని ఏలడం కామన్ అంటూ ధాన్యలక్ష్మికి పొగ పెడుతుంది. ఏం చేస్తే నీ వాటా ఆస్తి నీకు వస్తుందో దాని గురించి ఆలోచించమని అంటుంది రుద్రాణి.
కౌంట్ డౌన్ స్టార్ట్..
మరోవైపు సుభాష్‌కి కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది అపర్ణ. కాఫీలో షుగర్ ఎక్కువైపోయిందని సుభాష్ అంటే.. అంత కంటే తీపి వార్త చెబుతానని అపర్ణ అంటే.. అదే కదా నా బాధ కూడా వాడు రోజుకు ఒకసారి మారుతూ తలనొప్పి తీసుకొస్తున్నాడని సుభాష్ అంటాడు. లేదు కావ్య మీద ప్రేమను చూపిస్తున్నాడు.. ఇందాక వంట బాగుందని పొగిడాడు.. కావ్యని డిస్టర్బ్ చేయకుండా వాడే కాఫీ పెట్టుకున్నాడని అపర్ణ అంటే.. అవునా అది మంచిది కదా అని సుభాష్ కూడా ఆనంద పడతాడు. అదంగా చాటుగా విని సంతోష పడుతుంది కావ్య. ఇక రాత్రి అవుతుంది. రాజ్ బయట ఉంటే అప్పుడే పీఏ ఫోన్ చేసి.. రేపు బ్యాంక్ వాళ్లు ఆఫీస్‌కి వస్తారని చెబుతాడు. సరే నేను చూసుకుంటానని రాజ్ అంటాడు. ఇక రాజ్‌కి ఏం చేయాలో అర్థం కాదు. లాభం లేదు వెంటనే కళావతి హెల్ప్ తీసుకోవాలని అనుకుంటాడు. ఇక గదిలోకి వెళ్లి నీకో ముఖ్యమైన విషయం చెప్పాలని రాజ్ అంటే.. కావ్య అది ప్రేమ గురించి అని సిగ్గు పడుతుంది. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది. రేపటి ఎపిసోడ్‌లో కావ్యకు నిజం చెప్పి ఏడుస్తూ హగ్ చేసుకుంటాడు రాజ్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..