AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uday Kiran: రాజమౌళితో ఉదయ్ కిరణ్ మిస్ అయిన బ్లాక్ బస్టర్‌ .. ఈమూవీ చేసి ఉంటే కెరీర్ మరోలా ఉండేదేమో!

ఉదయ్ కిరణ్.. ఈ లోకాన్ని వదిలి సుమారు పదేళ్లుపైగానే అవుతోంది. అయినా ఇప్పటికీ ఈ హ్యాండ్సమ్ హీరో గురించి ఎక్కడో ఒక చోట వింటూనే ఉంటాం. ఇక టీవీల్లో ఉదయ్ కిరణ్ సినిమాలు వస్తుంటే ఎమోషనల్ అయిపోతుంటాం. ఇక సినీ ప్రముఖులు కూడా ఉదయ్ కిరణ్ మరణాన్ని తరచూ గుర్తు చేసుకుని ఎమోషనల్ అవుతుంటారు.

Uday Kiran: రాజమౌళితో ఉదయ్ కిరణ్  మిస్ అయిన బ్లాక్ బస్టర్‌ ..  ఈమూవీ చేసి ఉంటే కెరీర్ మరోలా ఉండేదేమో!
Ss Rajamouli, Uday Kiran
Basha Shek
|

Updated on: Dec 19, 2024 | 12:30 PM

Share

సినిమా ఇండస్ట్రీలో ఉదయ్ కిరణ్ ఓ ధ్రువతారలా వెలిగాడు. మొదటి సినిమా చిత్రంతోనే సూపర్ హిట్ సొంతం చేసుకున్నాడు. యూత్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఆపై నువ్వు నేను సినిమా తో ఏకంగా బ్లాక్ బస్టర్ కొట్టాడు. అంతేకాదు ఈ సినిమా ఉదయ్ స్టార్ డమ్ ను అమాంతం పెంచేసింది. ఆ తర్వాత వచ్చిన మనసంతా నువ్వే కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దీంతో ఉదయ్ కిరణ్ పేరు టాలీవుడ్ లో మార్మోగిపోయింది. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉదయ్ కిరణ్‌కు తిరుగుండదనుకున్నారు. స్టార్ హీరో రేంజ్ కు వెళ్లిపోతాడని అనుకున్నారు. కానీ.. అక్కడే విధి ఉదయ్ కిరణ్ ను చిన్న చూపు చూసింది. అనూహ్యంగా వరుస ఫ్లాప్ లు ఉదయ కిరణ్ ను కెరీర్ ను ప్రశ్నార్థకం చేశాయి. ఎన్ని సినిమాలు చేసినా తాను కోరుకున్న విజయం దక్కలేదు. మార్కెట్ కూడా బాగా పడిపోయింది. అవకాశాలు కూడా తగ్గడంతో మనస్థాపానికి గురయ్యాడు ఉదయ్. మానసిక క్షోభకు గురై ఆత్మహత్య చేసుకొని శాశ్వతంగా ఈ లోకం నుంచి వెళ్లిపోయాడు.

సినిమా ఇండస్ట్రీలో ఎంత వేగంగా ఎదిగాడో అంతే వేగంగా డౌన్ ఫాల్ అయ్యాడు ఉదయ్ కిరణ్. ఇందుకు తన స్వీయ తప్పిదాలు కూడా ఒక కారణమని తెలుస్తోంది. కాగా ఉదయ్ కిరణ్.. తన కెరీర్‌లో చాలా బ్లాక్ బస్టర్‌లు మిస్ చేసుకున్నాడని అప్పుడప్పుడు వార్తలు వినిపిస్తుంటాయి. అందులో దర్శక ధీరుడు రాజమౌళి సినిమా కూడా ఉందట. అప్పటికే యూత్ లో బాగా గుర్తింపు తెచ్చుకున్న ఉదయ్ కిరణ్‌తో రాజమౌళి కూడా ఒక సినిమాను ప్లాన్ చేశాడట. ఎన్టీఆర్ తో ‘స్టూడెంట్ నెంబర్ 1’ సినిమా తెరకెక్కిస్తోన్న సమయంలోనే స్టోరీ కూడా రాసుకున్నాడట. అయితే ఏమైందో తెలియదు కానీ ఉదయ్ కిరణ్ ప్లేసులో నితిన్ ను తీసుకున్నారట. ఆ సినిమా ఏదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకుంటా. యస్. అదే సై సినిమా.

సై సినిమా గనక నితిన్ కు బదులు ఉదయ్ కిరణ్‌కు పడుంటే.. తన కెరీర్ వేరేలా ఉండేదని ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..