- Telugu News Photo Gallery Cinema photos Do You Know This Heroine is Doctor Cum Singer She Is Director Shankar Daughter Aditi Shankar
Tollywood: ఏంటీ.. ఈ అమ్మాయి డాక్టర్ ఆ.. ? సింగర్ కమ్ హీరోయిన్.. ఆ స్టార్ డైరెక్టర్ కూతురు..
సోషల్ మీడియాలో ఇప్పుడు ఓ ఫోటో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇంతకీ ఆ ఫోటోలో స్పెషల్ ఏంటీ అనుకుంటున్నారా. ? ఇన్నాళ్లు వెండితెరపై, అందం, నటనతో అలరించిన ఓ హీరోయిన్ డాక్టర్ కావడమే ఆ ఫోటోలో విశేషం. తమ ఫేవరేట్ హీరోయిన్ డాక్టర్ అని తెలిసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్.
Updated on: Dec 19, 2024 | 12:12 PM

పైన ఫోటోలో కనిపిస్తున్న ఆ డాక్టర్ సౌత్ ఇండస్ట్రీలో ఫేమస్ హీరోయిన్. అంతేకాదు.. ఆమె సింగర్ కూడా. ఇప్పుడిప్పుడే వెండితెరపై కథానాయికగా అలరిస్తుంది ఈ వయ్యారి. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా..? ఆమె ఓ స్టార్ డైరెక్టర్ కూతురు.

ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ అదితి శంకర్. ఫేమస్ పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ కూతురు. 1993 జూన్ 19న చెన్నైలో జన్మించిన అదితి.. నటనపై ఆసక్తితో సినీరంగంలోకి కథానాయికగా అడుగుపెట్టింది.

తొలి చిత్రం హీరో కార్తి సరసన విరుమాన్ సినిమా. మొదటి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత శివకార్తికేయన్ జోడిగా మావీరన్ చిత్రంలో నటించింది. ఇదే చిత్రంలో సింగర్ గానూ నిరూపించుకుంది.

అయితే ఇండస్ట్రీలోకి రాకముందే అదితి ఎంబీబీఎస్ పూర్తి చేసింది. పలు ఆసుపత్రులలో డాక్టర్ గా సేవలు అందించింది. శ్రీరామచంద్ర యూనివర్సిటీలో అదితి తన ఎంబీబీఎంస్ పూర్తి చేసింది.

ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది అదితి శంకర్. అలాగే సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. అటు నటిగా, సింగర్ గా, ఇటు డాక్టర్ గా బిజీగా ఉంటుంది అదితి.





























