AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun: సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో బిగ్ ట్విస్ట్.. హీరో అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో బిగ్ ట్విస్ట్.. ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ కు హైదరాబాద్ చిక్కడ పల్లి పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో ఏ 11గా ఉన్న ఆయనను ఇటీవలే అరెస్ట్ చేశారు. అయితే కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో బయటకు వచ్చారు.

Allu Arjun: సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో బిగ్ ట్విస్ట్.. హీరో అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
Allu Arjun
Basha Shek
|

Updated on: Dec 23, 2024 | 9:26 PM

Share

సంథ్యా థియేటర్‌ తొక్కిసలాట ఎపిసోడ్‌ రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో తాజాగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అల్లు అర్జున్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. మంగళవారం ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. సంధ్య థియేటర్‌ ఘటనలో ఈ నోటీసులు ఇచ్చారు పోలీసులు. అల్లు అర్జున్ బెయిల్ రద్దు అంశంపై పోలీస్ శాఖ ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. ఈసారి హైకోర్టు ఇచ్చిన మద్యంతర బెయిల్‌ను సవాల్ చేస్తూ..సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా అల్లు అర్జున్ యాక్టివిటీ ఉందంటూ పోలీస్ శాఖ భావిస్తోంది. అందుకే సీసీటీవీ ఫుటేజీ, ఘటన జరిగిన రోజు దొరికిన వీడియో ఫుటేజ్ ఆధారంగా పక్కా ఆధారాలు సేకరిస్తోన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్‌కు మరోసారి నోటీసులు పంపడం ఆసక్తిగా మారింది.

కాగా డిసెంబర్ 4వ తేదీని పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర  తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయంది. అలాగే ఆమె కుమారుడు శ్రీ తేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఈ పిల్లాడు సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన అందరినీ కలిచివేసింది.  ఇక దీనిపై పోలీస్ కేసు కూడా నమోదైంది. సంధ్యా థియేటర్ నిర్వాహకులు, మేనేజర్లతో పాటు హీరో అల్లు అర్జున్ పై కూడా కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో ఏ11 గా ఉన్న అల్లు అర్జున్ ను హఠాత్తుగా అరెస్ట్ చేయడం తీవ్ర కలకలం రేపింది. కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసినా బన్నీ ఒక రోజు రాత్రంతా చంచల్ గూడ జైలులో గడిపాడు. ఆ మరుసటి రోజు విడుదలయ్యాడు. ఇప్పుడు హైదరాబాద్ పోలీసులు అల్లు అర్జున్ కు మళ్లీ నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది.  మొత్తానికి ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. దీనికి తోడు రాజకీయ నాయకులు ఈ కేసుపై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో పొలిటికల్ గా కూడా హీట్ పెరుగుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.