- Telugu News Photo Gallery Cinema photos Nandamuri Balakrishna's using the same sentiment in Daaku Maharaaj
Balakrishna: పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
సెంటిమెంట్ ఒకసారి కలిసొచ్చిందంటే.. దాన్ని వదలడానికి మనసు రాదు మన హీరోలకు. అందులోనూ హిట్లు వస్తుంటే.. నో కాంప్రమైజ్ అంటారు. తాజాగా బాలయ్య ఇదే చేస్తున్నారు. అఖండతో మొదలైన సెంటిమెంట్‌ను ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నారు. ఇంతకీ ఏంటా సెంటిమెంట్..? బాలయ్య ఉన్న ఫామ్ చూస్తుంటే మిగిలిన హీరోలకు భయమేస్తుందిప్పుడు. 60 ప్లస్‌లో దూకుడు చూపిస్తున్నారు నందమూరి నటసింహం.
Updated on: Dec 23, 2024 | 9:01 PM

సెంటిమెంట్ ఒకసారి కలిసొచ్చిందంటే.. దాన్ని వదలడానికి మనసు రాదు మన హీరోలకు. అందులోనూ హిట్లు వస్తుంటే.. నో కాంప్రమైజ్ అంటారు. తాజాగా బాలయ్య ఇదే చేస్తున్నారు. అఖండతో మొదలైన సెంటిమెంట్‌ను ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నారు. ఇంతకీ ఏంటా సెంటిమెంట్..?

బాలయ్య ఉన్న ఫామ్ చూస్తుంటే మిగిలిన హీరోలకు భయమేస్తుందిప్పుడు. 60 ప్లస్‌లో దూకుడు చూపిస్తున్నారు నందమూరి నటసింహం. సంక్రాంతికి డాకూ మహరాజ్ అంటూ వచ్చేస్తున్నారీయన.

ఫామ్‌కు తోడు ఓ పాజిటివ్ సెంటిమెంట్ బాలయ్యకు కలిసొస్తుందిప్పుడు. అదే చిన్నపాప సెంటిమెంట్.. దానిచుట్టూ తిరిగే ఎమోషన్. అఖండలో కథ అంతా చిన్నపాప చుట్టూనే తిరుగుతుంది.

సెట్స్‌పై ఉన్న అఖండ 2లోనూ మెయిన్ కథ ఇదే ఉండబోతుంది. ఈ పాత్ర కోసం సీనియర్ నటి లయ కూతురు శ్లోకాను తీసుకున్నారు. తాజాగా డాకూ మహరాజ్‌లో కూడా ఓ చిన్నపాప ఉంది. చిన్ని అంటూ సాగే ఈ పాటలో పాప సెంటిమెంట్ బలంగా కనిపిస్తుంది.

గతేడాది విడుదలైన భగవంత్ కేసరిలోనూ పాప సెంటిమెంట్ ఉంది. అందులో శ్రీలీల, బాలయ్య మధ్య బలమైన ఎమోషన్ ఉంటుంది. ముఖ్యంగా ఉయ్యాలో ఉయ్యాలా పాట బాగా హిట్టైంది. మొత్తానికి అఖండ నుంచి ప్రతీ సినిమాలోనూ చిన్న పాప సెంటిమెంట్ బాగా వర్కవుట్ అవుతుంది.




