AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa 2 : ‘దమ్ముంటే పట్టుకోరా షెకావత్’.. పుష్ప 2లో అల్లు అర్జున్ పాడిన సాంగ్ వచ్చేసింది

అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 నుంచి అవైటెడ్‌ మాస్ ట్రాక్ వచ్చేసింది. 'దమ్ముంటే పట్టుకోరా షెకావత్' అని లిరిక్స్ తో సాగే ఈ పాటను కొన్ని గంటల క్రితం రిలీజ్ చేశారు మూవీ మేకర్స్‌. కేవలం మూడే మూడు లైన్లతో ఉన్న పాట ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్‌ని ఉపేస్తోంది.

Pushpa 2 : 'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2లో అల్లు అర్జున్ పాడిన సాంగ్ వచ్చేసింది
Pushpa 2 Movie
Basha Shek
|

Updated on: Dec 24, 2024 | 6:52 PM

Share

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సంధ్య థియేటర్ ఘటనలో విచారణకు హాజరయ్యాడు. చిక్కడపల్లి పోలీసులు ఎలాంటి ప్రశ్నలు సంధిస్తున్నారు? ఏయే అంశాలపై స్టేట్‌మెంట్‌ రికార్డ్ చేస్తున్నారన్న ఉత్కంఠ మొదలైంది. సరిగ్గా ఆ సమయంలో పుష్ప-2 నుంచి సాంగ్ రిలీజ్‌ అయింది.  పుష్ప-2 మూవీ బాక్సాఫీస్‌ దుమ్ము దులుపుతోంది. రికార్డ్‌ల మీద రికార్డ్‌లు సాధిస్తూ హిస్టరీ క్రియేట్ చేస్తోంది. ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా 1500కోట్లు రాబట్టింది. ఒక్క హిందీలోనే 700ల కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ జోష్‌ మరింత రెట్టింపు చేస్తూ దమ్ముంటే పట్టుకోరా సాంగ్‌ను రిలీజ్ చేసింది పుష్ప టీమ్‌. పుష్ప-2లో ఫహద్ ఫాజిల్ పోషించిన సాలిడ్ రోల్ భన్వర్ సింగ్ షెకావత్‌కి ఛాలెంజ్ విసురుతూ.. దమ్ముంటే పట్టుకోరా షెకావత్.. పట్టుకుంటే వదిలేస్తా సిండికేటు అని హీరో మాస్‌ డైలాగ్‌ ఉంటుంది. నిజానికి సినిమా చూసిన వాళ్లంతా ఈ డైలాగ్‌ను సాంగ్‌ రూపంలో వదలాలని కోరుతున్నారు. దీంతో ఈ ట్రాక్‌ని పాన్ ఇండియా భాషల్లో అఫీషియల్‌గా రిలీజ్ చేశారు మేకర్స్‌.

ఇవి కూడా చదవండి

యూట్యూబ్‌లో సాంగ్ రిలీజైన కొద్ది గంటల్లోనే లక్షల వ్యూస్‌లతో దూసుకుపోతుంది. పుష్ప సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీలో కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది.  మలయాళ సూపర్ స్టార్  ఫహద్ ఫాజల్ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించారు. అలాగే జగపతిబాబు, సునీల్, అనసూయ, రావు రమేష్ తదితరులు కీ రోల్స్ పోషించారు. ఇక డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల ఒక స్పెషల్ సాంగ్ లో సందడి చేసింది. డిసెంబర్ 05న విడుదలైన పుష్ప 2 సినిమా ఇప్పటికే రూ. 1700 కోట్లకు చేరువలో ఉంది. ఒక్క హిందీ లోనే అల్లు అర్జున్ సినిమాకు రూ. 700 కోట్లకు పైగా కలెక్షన్లు రావడం విశేషం. లాంగ్ రన్ లో ఇది 1000 కోట్లను దాటే అవకాశముందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. అలాగే ఓవరాల్ కలెక్షన్లు కూడా రూ.2000 కోట్లను అధిగమించవచ్చని అంచనా  వేస్తున్నారు.

దమ్ముంటే పట్టుకోరా సాంగ్..

త్రీడీలో పుష్ప 2 సినిమా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
20 ఏళ్ల పోరాటం.. ప్రభుత్వ కొలువు వచ్చిన మర్నాడే రిటైర్‌మెంట్!
20 ఏళ్ల పోరాటం.. ప్రభుత్వ కొలువు వచ్చిన మర్నాడే రిటైర్‌మెంట్!
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!