PV Sindhu: ‘చూడముచ్చటైన జంట’.. పీవీ సింధు-సాయిల పెళ్లి ఫొటోలు చూశారా?
భారత బ్యాడ్మింటన్ క్వీన్ పీవీ సింధు ఇటీవలే పెళ్లిపీటలెక్కిన సంగతి తెలిసిందే. బిజినెస్ మెన్ వెంకట దత్తసాయితో కలిసి ఆమె ఏడడుగులు నడిచింది. రాజస్థాన్లోని ప్రఖ్యాత ఉదయ్ పూర్ ప్యాలెస్ వేదికగా డిసెంబర్ 22 న వీరి వివాహం అట్టహాసంగా జరిగింది.
Pv Sindhu
Follow us
రాజస్థాన్లోని ఉదయ్ సాగర్ సరస్సు వేదికగా పెళ్లిపీటలెక్కారు పీవీ సింధు- వెంకటదత్త సాయి. పెళ్లై రెండు రోజులు గడుస్తున్నా వీరి పెళ్లి ఫొటోలు బయటకు రాలేదు.
అయితే తాజాగా తన వివాహ వేడుక ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది పీవీ సింధు. పెళ్లి వేడుకలో భాగంగా తన భర్తతో కలిసున్న పలు ఫొటోలను అందులో షేర్ చేసింది.
తన పెళ్లి ఫొటోలకు లవ్ ఎమోజీ క్యాప్షన్ ఇచ్చింది పీవీ సింధు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోష ల్ మీడియాలో బాగా వైరలవుతన్నాయి.
వీటిని చూసిన పలువురు క్రీడా, సినీ, రాజకీయ ప్రముఖులు పీవీ సింధు-సాయి దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
సింధు, సాయిల వివాహ వేడుకకు కేవలం ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, ప్రత్యేక అతిథుల మాత్రమే హాజరయ్యారు.
ఈ క్రమంలోనే మంగళవారం(డిసెంబరు 24) రాత్రి సింధు- వెంకట దత్త సాయి వివాహ రిసెప్షన్ హైదరాబాద్ వేదికగా జరుగనుంది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు హాజరుకానున్నారు.