చలికాలంలో పొంచిఉన్న సైలెంట్‌ హార్ట్ ఎటాక్‌..ఎందుకొస్తుందంటే?

24 December 2024

TV9 Telugu

TV9 Telugu

మన శరీరంలో ఉన్న అతి ముఖ్యమైన, సున్నితమైన భాగాల్లో గుండె కూడా ఒకటి. అటువంటి గుండె ఆరోగ్యంగా ఉండటం కోసం ప్రతిఒక్కరూ ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవాలి

TV9 Telugu

సరైన  వ్యాయామం లేకపోవడం, ధూమపానం, మధుమేహం, బీపీ... వంటివాటినే ఇంతవరకూ గుండెజబ్బులకు కారణాలుగా పేర్కొన్నారు హృద్రోగనిపుణులు. అందుకే ఆయా అంశాలపట్ల అవగాహన అవసరం

TV9 Telugu

ముఖ్యంగా చలికాలంలో సైలెంట్ హార్ట్ ఎటాక్ ప్రమాదం చాలా ఎక్కువ. చలి కారణంగా, రక్త నాళాలు సంకోచించుకుపోతాయి. ఫలితంగా ఇది రక్త ప్రవాహాన్ని ప్రభావితం చేస్తుంది

TV9 Telugu

అయితే శీతాకాలంలోనే ఎందుకు ఎక్కువగా గుండె సమస్యలు పెరుగుతాయో చాలా మందికి తెలియదు. ఇందుకు అనేకానేక కారణాలు ఉన్నాయి

TV9 Telugu

మధుమేహం, అధిక రక్తపోటు, ఊబకాయంతో బాధపడుతున్న వ్యక్తులు ఎక్కువగా సైలెంట్ హార్ట్ ఎటాక్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. ఇది వచ్చే ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అవేంటంటే..

TV9 Telugu

ఛాతీ, వీపు, మెడ, దవడలో తేలికపాటి నొప్పి అనిపిస్తుంది. వీటిని ఎట్టిపరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు. అలాగే శ్వాస తీసుకోవడంలో ఆకస్మిక ఇబ్బంది లేదా ఊపిరాడకుండా అనిపించడం కూడా ఒక లక్షణమే

TV9 Telugu

ఎటువంటి శారీరక శ్రమ లేకపోయినా అధిక అలసట, బలహీనత అనుభూతి చెందడం మరొక ప్రధాన లక్షణం. అందుకే ఈ కాలంలో గుండె ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి

TV9 Telugu

రోజూ తేలికపాటి వ్యాయామం చేయడం, పండ్లు, కూరగాయలు, ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం, శరీరాన్ని వెచ్చగా ఉంచే బట్టలు ధరించడం, ఒత్తిడిని తగ్గించుకోవడం వంటివి చేయాలి