Fitness: బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నారా.. కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోండి..!

Fitness: ఒక వ్యక్తి జీవక్రియ అనేది వయస్సు, లింగం, జన్యుశాస్త్రం, శరీర కొవ్వు వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. మీ జీవక్రియ రేటు ఎక్కువగా

Fitness: బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నారా.. కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోండి..!
Weight Loss
Follow us
uppula Raju

|

Updated on: May 20, 2022 | 6:32 PM

Fitness: ఒక వ్యక్తి జీవక్రియ అనేది వయస్సు, లింగం, జన్యుశాస్త్రం, శరీర కొవ్వు వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. మీ జీవక్రియ రేటు ఎక్కువగా ఉంటే మీరు విశ్రాంతి సమయంలో కూడా ఎక్కువ కేలరీలని బర్న్ చేస్తారు. అధిక తీవ్రత గల వ్యాయామం కొవ్వును వేగంగా బర్న్‌ చేస్తుంది. అందుకే సాధ్యమైనంత వరకు జిమ్‌లో కష్టపడాలి. ఒకవేళ మీరు ఇతర వ్యాధులతో బాధపడుతుంటే రన్నింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్ వంటి తక్కువ తీవ్రత గల వ్యాయామాలు ప్రయత్నించవచ్చు. ఇవి మీ జీవక్రియను మెరుగుపరచడంతో పాటు బరువు తగ్గించడంలో సహాయపడుతాయి.

సరైన జీవక్రియకు నీరు కచ్చితంగా అవసరం. రోజు 1.5 లీటర్ల నీటిని తాగడం వల్ల బరువు తగ్గుతారని ఒక అధ్యయనంలో తేలింది. మీరు స్వల్పంగా డీ హైడ్రేషన్‌కి గురైతే మీ జీవక్రియ మందగిస్తుంది. మరో అధ్యయనం ప్రకారం.. రోజుకు ఎనిమిది లేదా అంతకంటే ఎక్కువ గ్లాసుల నీరు తాగే పెద్దలు ఎక్కువ కేలరీలని ఖర్చు చేస్తారని నిరూపణ అయింది. హైడ్రేటెడ్ గా ఉండటానికి భోజనం చేసే ముందు, చిరుతిండి తినే ముందు ఒక గ్లాసు నీరు తాగాలి. అలాగే మీ ఆహారంలో తాజా పండ్లు, కూరగాయలను చేర్చాలి. ఎందుకంటే అవి సహజంగా నీటిని కలిగి ఉంటాయి.

సరైన సమయానికి ఆహారం తినడం అనేది జీవక్రియ సమతుల్యతను కాపాడుతుంది. ప్రతి 3 నుంచి 4 గంటల మధ్య అల్పాహారం తీసుకోవడం మంచిది. క్రమం తప్పకుండా అల్పాహారం తీసుకునే వ్యక్తులు భోజన సమయంలో తక్కువ తింటారని అనేక అధ్యయనాలు చూపిస్తున్నాయి. అలా కాకుండా ఒక వ్యక్తి ఒకేసారి ఎక్కువ తిన్నా ఆ తర్వాత చాలాసేపు తినకుండా ఉంటే వారి శరీరంలో కేలరీలు నెమ్మదిగా కరుగుతాయి. జీవక్రియను ప్రోత్సహించడంలో, కొవ్వును కరిగించడంలో గ్రీన్ టీ ప్రధాన పాత్ర పోషిస్తుంది. 2 నుంచి 4 కప్పుల గ్రీన్ టీ తాగడం వల్ల కేలరీలు బర్న్ చేయవచ్చని పలు పరిశోధనలు సూచిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

మరిన్ని హెల్త్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
డ్రై ఆప్రికాట్లు తింటే.. బోలెడు లాభాలు ! తెలిస్తే రోజూ తింటారు..
డ్రై ఆప్రికాట్లు తింటే.. బోలెడు లాభాలు ! తెలిస్తే రోజూ తింటారు..
ప్రభాస్ సలార్ సినిమాపై ప్రశాంత్ నీల్ షాకింగ్ కామెంట్స్
ప్రభాస్ సలార్ సినిమాపై ప్రశాంత్ నీల్ షాకింగ్ కామెంట్స్