Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Oral Cancer: రోజు రోజుకి పెరుగుతున్న నోటి క్యాన్సర్‌ కేసులు.. 30 ఏళ్ల కంటే తక్కువ వయసున్నవారిలో అధికం..!

Oral Cancer: ధూమపానం, పొగాకు నమలడాన్ని కొంతమంది స్టైల్‌గా భావిస్తారు. కానీ ఇది ఆరోగ్యానికి చాలా హానికరం. పొగాకును సిగరెట్‌లలో వాడినా, సిగార్‌లలో వాడినా వాసన

Oral Cancer: రోజు రోజుకి పెరుగుతున్న నోటి క్యాన్సర్‌ కేసులు.. 30 ఏళ్ల కంటే తక్కువ వయసున్నవారిలో అధికం..!
Oral Cancer
Follow us
uppula Raju

|

Updated on: May 20, 2022 | 6:18 PM

Oral Cancer: ధూమపానం, పొగాకు నమలడాన్ని కొంతమంది స్టైల్‌గా భావిస్తారు. కానీ ఇది ఆరోగ్యానికి చాలా హానికరం. పొగాకును సిగరెట్‌లలో వాడినా, సిగార్‌లలో వాడినా వాసన మాత్రం ఒకటే. ఇది ఏ వయస్సు వ్యక్తి ఆరోగ్యాన్నైనా పాడు చేస్తుంది. పొగాకు ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందిని చంపుతుంది. పొగాకు వాడకం వల్ల నోటి క్యాన్సర్ కేసులు ఎక్కువవుతున్నాయి. పొగాకుకు సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా అన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మన దేశంలోని సినిమా హాళ్లలో సినిమా ప్రారంభానికి ముందు పొగాకు వల్ల కలిగే హాని గురించి ప్రకటనలను ప్రదర్శిస్తారు. అయినప్పటికీ పొగాకు వినియోగం పెరుగుతూనే ఉంది. దురదృష్టవశాత్తు యువతలో దీని వాడకం అధికంగా ఉంది. దీనివల్ల గుండె జబ్బులు, మధుమేహం, దృష్టి, వినికిడి సమస్యల పెరుగుతున్నాయి.

ఊపిరితిత్తులు, నోటి క్యాన్సర్ కాకుండా అనేక ఇతర రకాల క్యాన్సర్లకు ప్రధాన కారణం పొగాకు వాడకం. గుండె సంబంధిత వ్యాధులు, మధుమేహం, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు, దృష్టి, వినికిడి సమస్యలు, దంతాలలో సమస్యలు మొదలైన వాటికి పొగాకు వాడకం ప్రధాన కారణం. ఎందుకంటే పొగాకులో అత్యంత విషపూరితమైన పదార్థాలు ఉంటాయి. క్యాన్సర్ కారకాలు కార్సినోజెన్లు, నికోటిన్ ఉంటాయి. ఇందులో నికోటిన్‌ చాలా హానికరం. ధూమపానం అనేది పొగాకు వాడకం అత్యంత సాధారణ రూపం. ఇది 90% ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులకు కారణమవుతుంది. అలాగే ఇది నోటి క్యాన్సర్ ప్రమాదాన్ని 10 రెట్లు పెంచుతుంది.

పొగాకు నోటి కుహరం, గొంతు, అన్నవాహిక, ఊపిరితిత్తులకు సంబంధించిన కణితుల సమస్యను తీవ్రతరం చేస్తుంది. పొగాకు నమలడం లేదా ప్యాక్ చేసిన ఆకులను పీల్చడం వల్ల కడుపు క్యాన్సర్‌తో పాటు పెదవులు, బుగ్గలు, చిగుళ్ల క్యాన్సర్ బారిన పడే ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుంది. నోటి కేన్సర్ నోటి కుహరంలో లేదా నాలుక, కింది పెదవి, చిగుళ్ళు, దవడ లేదా నోటి దిగువ భాగంలో, సోకుతుంది. స్క్వామస్ సెల్ కార్సినోమా అనేది అత్యంత సాధారణ నోటి క్యాన్సర్. ఇది తరచుగా పురుషుల నోటి దిగువ భాగంలో, నాలుకలో కనిపిస్తుంది. అలాగే ఇది మహిళల నాలుక లేదా చిగుళ్ళలో కనిపిస్తుంది. నోటి క్యాన్సర్ అనేక రకాలుగా ఉంటుంది. ఇది ప్రజలందరిని ప్రభావితం చేస్తుంది. అయినప్పటికీ చాలా కేసులు 30 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వారిలో వెలుగు చూస్తున్నాయి. వివిధ రకాల నోటి క్యాన్సర్, అనేక ఇతర రకాల క్యాన్సర్ల సందర్భాలలో వీటిని ముందస్తుగా గుర్తించడం ద్వారా మాత్రమే తగ్గించవచ్చు.

ఇవి కూడా చదవండి

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

మరిన్ని హెల్త్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి