Monkeypox: మంకీపాక్స్‌ చాలా ప్రమాదకరం.. లక్షణాలు, చికిత్స విధానం తెలుసుకోండి..!

Monkeypox: గత రెండేళ్లుగా కరోనా ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికి ప్రజలు కరోనా సంక్షోభం నుంచి కోలుకోలేకపోతున్నారు. తాజాగా

Monkeypox: మంకీపాక్స్‌ చాలా ప్రమాదకరం.. లక్షణాలు, చికిత్స విధానం తెలుసుకోండి..!
Monkeypox
Follow us
uppula Raju

|

Updated on: May 20, 2022 | 4:22 PM

Monkeypox: గత రెండేళ్లుగా కరోనా ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికి ప్రజలు కరోనా సంక్షోభం నుంచి కోలుకోలేకపోతున్నారు. తాజాగా మంకీపాక్స్ కేసులు పెరుగుతున్నాయి. అనేక దేశాలలో రోగులని నిర్ధారిస్తున్నారు. పోర్చుగల్‌లో ఇప్పటివరకు అత్యధిక సంఖ్యలో14 మందిని గుర్తించారు. 6 గురు అనుమాన స్థితిలో ఉన్నారు. UK లో 9 మంది, USA లో ఒక్కరిని గుర్తించారు. స్పెయిన్‌లో 7 గురు, 40 మంది అనుమానితులుగా ఉన్నారు. కెనడాలో 13 మంది అనుమానితులుగా గుర్తించారు. మంకీపాక్స్ వ్యాధి జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే అరుదైన వ్యాధి. ఈ వ్యాధికి సంబంధించి ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం.

మంకీపాక్స్ అంటే ఏమిటి

US సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (CDC) ప్రకారం.. 1958లో మంకీపాక్స్ మొదటి కేసు నమోదైంది. అప్పట్లో ఈ వ్యాధి కోతులలో కనిపించింది. మశూచి లాంటి వ్యాధి లక్షణాలు ఈ కోతులలో కనిపించాయి. కానీ 1970వ సంవత్సరంలో ఆఫ్రికాలో మొదటిసారిగా మనుషులకి మంకీపాక్స్‌ సోకింది. 1970 తరువాత ఆఫ్రికాలోని 11 దేశాలలో మంకీపాక్స్‌ రోగులని నిర్ధారించారు. ఆఫ్రికా నుంచి ఈ వ్యాధి ఇతర దేశాలకు విస్తరించింది. 2003లో అమెరికాలో ఈ వ్యాధి రోగులని కనుగొన్నారు. 2018 సంవత్సరంలో ఈ వ్యాధి ఇజ్రాయెల్, బ్రిటన్‌లకు చేరుకుంది. ఇప్పుడు మంకీపాక్స్‌ కేసులు పోర్చుగల్, యుకె, స్పెయిన్, కెనడా, యుకెలలో కూడా కనుగొన్నారు.

ఇవి కూడా చదవండి

మంకీపాక్స్ లక్షణాలు ఏమిటి

మంకీపాక్స్ మొదట్లో మీజిల్స్, మశూచి లేదా చికెన్ పాక్స్ లాగా కనిపిస్తుంది. ఇందులో మొటిమలా తయారై శరీరంలోని ఇతర భాగాలకు విస్తరిస్తుంది. ఈ వ్యాధి సోకినప్పుడు రోగి జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, వెన్నునొప్పి, శోషరస గ్రంథులు వాపు, చలి, అలసట, న్యుమోనియా లక్షణాలు, ఫ్లూ లక్షణాలతో బాధపడుతాడు. ఇది కాకుండా శరీరం అంతటా దద్దుర్లు లేదా బొబ్బలు వస్తాయి.

మంకీపాక్స్ ఎలా వ్యాపిస్తుంది?

మంకీపాక్స్ వ్యాధి జంతువుల ద్వారా వ్యాపించే వ్యాధి. కోతులు కాకుండా, ఎలుకలు, ఉడుతల నుంచి కూడా ఈ వ్యాధి వస్తుంది. మంకీపాక్స్ వ్యాధి సోకిన జంతువు రక్తం దాని శరీర చెమట లేదా దాని గాయాలతో ప్రత్యక్ష సంబంధం వల్ల ఈ వ్యాధి సోకుంతుంది. మంకీపాక్స్ నయం కావడానికి రెండు నుంచి నాలుగు వారాలు పట్టవచ్చు. గాయం గట్టిపడటం వల్ల నొప్పిగా ఉంటుంది. ఈ సమయంలో చికిత్స ముఖ్యం లేదంటే న్యుమోనియా లక్షణాలు రోగనిరోధక వ్యవస్థ బలహీనపరుస్తాయి. WHO ప్రకారం మంకీపాక్స్ సోకిన ప్రతి 10వ వ్యక్తి చనిపోయే అవకాశాలు ఉన్నాయి. చిన్నపిల్లలు, వృద్ధులు ఈ ఇన్ఫెక్షన్‌కు ఎక్కువగా గురయ్యే అవకాశం ఉంది. సకాలంలో చికిత్స చేస్తే ఈ వ్యాధి లక్షణాలు రెండు నుంచి నాలుగు వారాలలో వాటంతట అవే తగ్గుతాయి.

మరిన్ని హెల్త్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?