Telugu News » Photo gallery » Benefits of adding sesame oil in your daily routine telugu health tips
Sesame Oil: నువ్వుల నూనెతో గుండెను పదిలంగా కాపాడుకోవచ్చు.. ఇంకా మరెన్నో ప్రయోజనాలు
ప్రస్తుత పరిస్థితుల్లో చాలామంది పలు రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటి సమయంలో ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాలను తీసుకోవాలని నిపుణులు పేర్కొంటున్నారు.
Sesame Oil: ప్రస్తుత పరిస్థితుల్లో చాలామంది పలు రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటి సమయంలో ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాలను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దీంతోపాటు వంటలో ఆరోగ్యకరమైన నూనెలను ఉపయోగించాలి. వంట నూనెల విషయానికి వస్తే.. నువ్వుల నూనె మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నూనెతో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పేర్కొంటున్నారు.
1 / 6
వంట నూనె గుండె పనితీరును అలాగే ఆరోగ్యంగా ఉంచేది వినియోగించాలి. కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించేలా ఉండాలి. వంటనూనెను ఎంపిక చేసుకోవడంలో పొరపాటు చేస్తే ప్రమాదం తప్పదు. లిన్సీడ్ నూనెలో లినోలెయిక్ యాసిడ్ ఉంటుంది. ఈ పదార్ధం చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచదు. దీంతోపాటు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
2 / 6
వంట నూనె గుండెను బాగా ఉంచేలా ఉండాలి. కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించండి. వంటనూనెను ఎంపిక చేసుకోవడంలో పొరపాటు చేస్తే ప్రమాదం తప్పదు. లిన్సీడ్ నూనెలో లినోలెయిక్ యాసిడ్ ఉంటుంది. ఈ పదార్ధం చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచదు మరియు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
3 / 6
నువ్వుల నూనె మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నువ్వుల నూనెలో ఫైబర్ ఉంటుంది. ఈ పీచు రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ నూనెను సురక్షితంగా వినియోగించవచ్చు.
4 / 6
బరువు తగ్గడం విషయానికి వస్తే.. చాలా మంది కొవ్వు పదార్ధాలకు దూరంగా ఉంటారు. కానీ అది చాలా తప్పు. బరువు తగ్గే బదులు ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలను ఆహారంలో చేర్చుకోవాలి. నువ్వుల ఆయిల్ మీకు బాగా ఉపయోగపడుతుంది.
5 / 6
అందుకే నువ్వుల నూనెను వంటలో ఉపయోగించాలని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.