Telugu News » Photo gallery » Feeling pain in back during driving try these best tricks in telugu
Back Pain: లాంగ్ డ్రైవ్ సమయంలో నడుంనొప్పి బాధిస్తుందా.. ఈ ట్రిక్స్ ట్రై చేయండి..!
Back Pain: లాంగ్ డ్రైవింగ్ కొన్నిసార్లు వెన్నునొప్పికి కారణం అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో డ్రైవింగ్‌లో కొన్ని మార్పులు చేసుకోవాలి. డ్రైవింగ్‌కు సంబంధించి
లాంగ్ డ్రైవింగ్ కొన్నిసార్లు వెన్నునొప్పికి కారణం అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో డ్రైవింగ్‌లో కొన్ని మార్పులు చేసుకోవాలి. డ్రైవింగ్‌కు సంబంధించి కొన్ని చిట్కాల గురించి తెలుసుకుందాం.
1 / 5
స్టీరింగ్ వీల్ నుంచి సరైన దూరం: డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సీటులో కూర్చున్న తర్వాత చాలా సార్లు ప్రజలు ముందుకు వంగి ఉంటారు. ఈ పరిస్థితిలో స్టీరింగ్ను పట్టుకోవడం సులభం. కానీ ఈ పద్ధతి వెన్ను నొప్పికి కారణమవుతుంది. బదులుగా స్టీరింగ్ వీల్ నుంచి సరైన దూరాన్ని పాటించాలి.
2 / 5
సీట్ బ్యాక్: కొందరు వ్యక్తులు డ్రైవింగ్ చేసేటప్పుడు మరింత సౌకర్యం కోసం సీటును వెనుకకు ఎక్కువగా వంచుతారు. ఈ పద్ధతి మీ వెన్ను భాగంలో ఒత్తిడిని కలిగిస్తుంది. ఇలా చేయడం మానుకోండి.
3 / 5
సీటు ఎత్తు: డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వెన్నునొప్పి రాకుండా ఉండేందుకు సీటు ఎత్తును సర్దుబాటు చేయడం అవసరం. ముందుగా సీటును కింది స్థానం నుంచి ఆపై అవసరాన్ని బట్టి పైకి లేపుతూ క్రమంగా సర్దుబాటు చేసుకోవాలి.
4 / 5
అడపాదడపా విశ్రాంతి: మీరు ఎక్కువసేపు డ్రైవింగ్ చేస్తుంటే శరీరం అలసిపోతుంది. మధ్యలో బండి ఆపి కాసేపు రిలాక్స్ కావాలి. విశ్రాంతి తీసుకోవడం ద్వారా మీరు రిఫ్రెష్ అవుతారు.