Cooking Oil: పామాయిల్ పై నిషేధం ఎత్తివేత.. త్వరలోనే తగ్గనున్న వంటనూనె ధరలు
కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్(Lock Down) లో మంటెక్కిన వంట నూనె ధరలు.. రష్యా - ఉక్రెయిన్ యుద్ధంతో మరింతగా కొండెక్కాయి. దీంతో లీటర్ నూనె(Cooking Oil) ధర రూ.200దాకా చేరింది. కొన్ని ప్రాంతాల్లో అయితే....

కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్(Lock Down) లో మంటెక్కిన వంట నూనె ధరలు.. రష్యా – ఉక్రెయిన్ యుద్ధంతో మరింతగా కొండెక్కాయి. దీంతో లీటర్ నూనె(Cooking Oil) ధర రూ.200దాకా చేరింది. కొన్ని ప్రాంతాల్లో అయితే రూ.200 దాటేసింది. అమాంతం పెరిగిన నూనె ధరలతో సామాన్యులు, సాధారణ తరగతి వారు, పేదవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో జూన్ నుంచి వంట నూనెల ధరలు క్రమంగా తగ్గే అవకాశం ఉందని వాణిజ్య వర్గాలు చెబుతున్నాయి. ప్రపంచంలోనే ఎక్కువగా పామాయిల్ ఉత్పత్తి చేసే ఇండోనేషియా(Indonesia).. ఇటీవల తన ఎగుమతులపై విధించిన నిషేధాన్ని తొలగించింది. ఎందుకంటే పామాయిల్‌ను ప్రపంచంలోనే ఎక్కువగా తయారు చేయడంతో పాటు ఎగుమతి చేసే ఇండోనేషియా, ఇటీవల తన ఎగుమతులపై విధించిన నిషేధాన్ని తొలగించింది. రేపటి నుంచి ఇది అమల్లోకి రానుంది. మరోవైపు.. రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం జరుగుతూనే ఉన్నా ఉక్రెయిన్ నుంచి సన్‌ఫ్లవర్ నూనె సరఫరాలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఉక్రెయిన్ నుంచి నూనె సరఫరాలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇందువల్ల నెలకు అదనంగా 20,000-25,000 టన్నుల మేర సన్‌ఫ్లవర్ నూనె సరఫరాలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. అందువల్ల ధరలు అదుపులోకి వస్తాయి.
ఇండోనేషియా ఏడాదికి 46 మిలియన్ టన్నుల పామాయిల్‌ను ఉత్పత్తి చేస్తోంది. ఆహార అవసరాలకు 9 మిలియన్ టన్నులు, బయోడీజిల్ కోసం మరో 9 మిలియన్ టన్నులను వినియోగించుకుంటుంది. మిగతా 28 మిలియన్ టన్నుల సరకును వివిధ దేశాలకు ఎగుమతి చేస్తోంది. ఈ పరిస్థితుల్లో ఏప్రిల్ 28 నుంచి పామాయిల్ ఎగుమతులను నిషేధిస్తున్నట్లు ఆ దేశం ప్రకటించింది. దీంతో వంటనూనెల ధరలు విపరీతంగా పెరిగాయి. ఎగుమతులపై నిషేధాన్ని తొలగిస్తున్నట్లు ఇండోనేషియా ఈనెల 19న ప్రకటించగానే, మార్కెట్‌లో ధరలు 5% తగ్గాయి.
మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
ఇవీ చదవండి
Assam floods: జల విలయంతో కకావికలం అవుతున్న అస్సాం.. నిరాశ్రయులైన లక్షలాది మంది..