AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia – Ukraine War: అమెరికా వాసులపై రష్యా నిషేధం.. ఆ విధానాలే కారణమా..?

రష్యా - ఉక్రెయిన్ యుద్ధం(Russia - Ukraine) ఆ రెండు దేశాలకు మాత్రమే కాకుండా ఇతర దేశాల మధ్య కూడా చిచ్చు పెడుతోంది. ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న దాడిని ఖండిస్తూ పలు దేశాలు వ్యతిరేకంగా ఉన్న విషయం తెలిసిందే. ఇలా రష్యాపై...

Russia - Ukraine War: అమెరికా వాసులపై రష్యా నిషేధం.. ఆ విధానాలే కారణమా..?
Vladimir Putin
Ganesh Mudavath
|

Updated on: May 22, 2022 | 7:41 AM

Share

రష్యా – ఉక్రెయిన్ యుద్ధం(Russia – Ukraine) ఆ రెండు దేశాలకు మాత్రమే కాకుండా ఇతర దేశాల మధ్య కూడా చిచ్చు పెడుతోంది. ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న దాడిని ఖండిస్తూ పలు దేశాలు వ్యతిరేకంగా ఉన్న విషయం తెలిసిందే. ఇలా రష్యాపై నిబంధనలు విధించిన దేశాల్లో అమెరికా(America) ముందువరసలో ఉంది. బైడెన్‌ సర్కారు ప్రతిపాదించిన 40 బిలియన్‌ డాలర్ల ఆర్థిక సాయానికి సెనెట్‌ ఆమోదించింది. ఈ ప్రతిపాదనలకు సంబంధించిన బిల్లును 86-11 ఓట్లతో పాస్‌ చేసింది. ఈ బిల్లు ప్రకారం సైనిక, మానవీయ సాయం అమెరికా నుంచి ఉక్రెయిన్‌కు అందనుంది. అంతేకాకుండా ఉక్రెయిన్ కు అమెరికా ఆర్థిక సహాయం అందించింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన రష్యా కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా వాసులపై నిషేధాజ్ఞలు విధించింది. ఇలా ఇప్పటివరకు 963 అమెరికన్లపై ప్రయాణ నిషేధం విధించినట్లు రష్యా వెల్లడించింది. గతంలోనే అధ్యక్షుడు బైడెన్‌, విదేశాంగ కార్యదర్శి ఆంటోని బ్లింకెన్‌, లపై ప్రయాణ నిషేధం విధించినట్లు తెలిపింది. ఆ జాబితాలో మరికొందరి పేర్లు చేర్చడంతో ఆ సంఖ్య 963కు చేరింది. అయితే ఈ ప్రయాణ నిషేధాలు పెద్దగా ప్రభావం చూపవని నిపుణులు అంటున్నారు.

ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్‌లోని మ‌రియ‌ుపోల్‌ విషయంలో రష్యా కీలక ప్రకటన చేసింది. మ‌రియ‌ుపోల్‌(Mariupol) లో కొన్ని నెల‌ల పాటు సాగిన యుద్ధం ముగిసిన‌ట్లు ర‌ష్యా ప్రక‌టించింది. అజోవ్ ప్లాంట్‌కు ర‌క్షణ‌గా ఉన్న ఉక్రెయిన్‌ సైనికులు పూర్తిగా లొంగిపోయిన‌ట్లు ర‌ష్యా ర‌క్షణ‌శాఖ కార్యాల‌యం ప్రకటించింది. ప్లాంట్‌లో పూర్తి ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చిన‌ట్లు ర‌ష్యా ద‌ళాలు తెలిపాయి. అంతకు ముందు 2400 మంది ఉక్రెయిన్‌ పౌరులు, సైనికులను రష్యా సైన్యం తమ అదుపులోకి తీసుకుంది. మరోవైపు.. ఉక్రెయిన్‌పై రష్యా దాడుల నేపథ్యంలో ఆంక్షల పర్వం కొనసాగుతూనే ఉంది.

ఉక్రెయిన్‌పై దాడుల్లో రష్యాకు సహకారం అందించిన కారణంగా బెలారస్‌పై సెర్బియా ఆంక్షలు విధించింది. అంతకుముందు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, రష్యాకు చెందిన ప్రముఖులపై కెనడా బ్యాన్‌ విధించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవీ చదవండి

America: వేల అడుగుల ఎత్తులో.. విమానంలో మహిళ ప్రసవం.. చిన్నారికి ఏ పేరు పెట్టారంటే

Chandrababu Naidu: విద్యుత్ కోతలతో పారిశ్రామికవేత్తలు పారిపోయేలా చేశారు.. సీఎంపై చంద్రబాబు ఫైర్