AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లారీ బీభత్సం.. ఏకంగా మెడికల్ షాపులోకి దూసుకెళ్లింది.. ఒకరు మృతి, మరొకరికి సీరియస్!

నల్గొండ జిల్లా నార్కెట్‌పల్లిలో లారీ బీభత్సం సృష్టించింది. నల్గొండ వైపు నుంచి అతివేగంగా దూసుకొచ్చిన లారీ, మూలమలుపు దగ్గర అదుపు తప్పింది. నేరుగా ఎదురుగా ఉన్న మెడికల్ షాప్ షటర్లను ఢీకొట్టింది. అనంతరం షాప్ ముందు ఉన్న పండ్ల బండిని బలంగా ఢీకొట్టడంతో అక్కడే ఉన్న ఓ వ్యక్తి స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయాడు.

లారీ బీభత్సం.. ఏకంగా మెడికల్ షాపులోకి దూసుకెళ్లింది.. ఒకరు మృతి, మరొకరికి సీరియస్!
Lorry Crashes Narketpally
M Revan Reddy
| Edited By: |

Updated on: Feb 27, 2026 | 8:34 AM

Share

నల్గొండ జిల్లా నార్కెట్‌పల్లిలో లారీ బీభత్సం సృష్టించింది. నల్గొండ వైపు నుంచి అతివేగంగా దూసుకొచ్చిన లారీ, మూలమలుపు దగ్గర అదుపు తప్పింది. నేరుగా ఎదురుగా ఉన్న మెడికల్ షాప్ షటర్లను ఢీకొట్టింది. అనంతరం షాప్ ముందు ఉన్న పండ్ల బండిని బలంగా ఢీకొట్టడంతో అక్కడే ఉన్న ఓ వ్యక్తి స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యాడు. ప్రమాదం తీవ్రతకు లారీ క్యాబిన్ పూర్తిగా నుజ్జునుజ్జు అయింది.

ఈ ప్రమాదంతో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ క్యాబిన్‌లో ఇరుక్కుపోవడంతో పోలీసులు సుమారు మూడు గంటల పాటు శ్రమించి అతన్ని బయటకు తీశారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. మూలమలుపు గమనించకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా పోలీసులు అంచనాకు వచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు పోలీసులు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇదే ప్రదేశంలో నెల రోజుల్లోనే రెండు కార్లు, ఒక లారీ ప్రమాదానికి గురైన ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో మూలమలుపు దగ్గర హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us