AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nara Lokesh-Janhvi Kapoor: నారా లోకేశ్‌పై ప్రశంసలు కురిపించిన హీరోయిన్ జాన్వీ కపూర్.. ఏం జరిగిందంటే?

సినిమాలతో బిజీ బిజీగా ఉండే స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ లేటెస్ట్ గా ఏపీ మంత్రి నారా లోకేశ్ పై ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు ట్విట్టర్ (ఎక్స్ ) లో ఆమె నారా లోకేశ్ ను ప్రశంసిస్తూ ఒక పోస్ట్ పెట్టగా, ఇప్పుడది నెట్టింట బాగా వైరల్ అవుతోంది.

Nara Lokesh-Janhvi Kapoor: నారా లోకేశ్‌పై ప్రశంసలు కురిపించిన హీరోయిన్ జాన్వీ కపూర్.. ఏం జరిగిందంటే?
Nara Lokesh, Janhvi Kapoor
Basha Shek
|

Updated on: Feb 27, 2026 | 7:14 AM

Share

ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పై బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ ప్రశంసలు కురిపించింది. ఇటీవల ఆయన తీసుకున్న ఒక నిర్ణయం పై ఆమె సోషల్ మీడియా వేదికగా స్పందించిది. ఈమేరకు జాన్వీ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు విషయంలోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాకు చెందిన చిన్నారి పునర్విక SMA టైప్-1 అనే అత్యంత అరుదైన , ప్రమాదకరమైన వ్యాధితో బాధపడుతోంది. ఈ జబ్బు సోకిన వారి కండరాలు క్రమంగా బలహీనపడి, శ్వాస తీసుకోవడం కూడా కష్టమవుతుంది. చికిత్స లో భాగంగా పాపకు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ‘జోల్గెన్స్మా’ అనే ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు . అయితే ఈ ఇంజెక్షన్ ఖరీదు అక్షరాలా రూ.16 కోట్లు. అంత స్తోమత లేని తల్లిదండ్రులు దాతలను ఆశ్రయించారు. తమ కూతురు చికిత్సకు ఆర్థిక సాయం అందించి కాపాడాలని కోరారు. ఈ క్రమంలో మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపిస్తూ చాలా మంది పునర్విక ఫ్యామిలీకి ఆర్థిక సాయం చేశారు. ఈ క్రమంలోనే విరాళాల ద్వారా రూ. 10 కోట్ల సమకూరగా, మరో రూ.6 కోట్లు అవసరమయ్యాయి. ఇక్కడే ఏపీ మంత్రి నారా లోకేశ్ తన గొప్ప మనసును చాటుకున్నారు. పునర్విక చికిత్స కోసం మిగిలిన రూ. 6 కోట్లు అందేలా చూసే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. ఈ మేరకు ట్విట్టర్ (ఎక్స్) వేదికగా కీలక ప్రకటన చేశారాయన.

ఇలాంటి పరిస్థితిలోనూ పునర్విక పోరాడుతున్న తీరు అభినందనీయమని మంత్రి లోకేశ్ ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టారు. ఇప్పుడది నెట్టింట వైరల్ గా మారింది. క్లిష్ట సమయంలో పునర్విక కుటుంబానికి అండగా నిలిచిన మంత్రి నారా లోకేశ్ పై సర్వత్రా ప్రశంసలు కురుస్తోంది. ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా దీనిపై స్పందించింది. నారా లోకేశ్ చేసిన ట్విట్టర్ పోస్టుకు రిప్లై ఇస్తూ.. ‘మానవత్వం ఇంకా బతికే ఉంది.. ఇది నిజంగా ప్రశంసనీయమైన కార్యం’ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. నెటిజన్స్ సైతం నారా లోకేష్ తీసుకున్న ఈ గొప్ప నిర్ణయానికి ఫిదా అవుతున్నారు. ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

జాన్వీ కపూర్ ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర