Mystery Village: ఆ ఊళ్లో మనుషులు, పశుపక్షాదులు అందరూ అంధులే..! ప్రపంచంలోనే రహస్య గ్రామం..

ఈ భూమిపై రహస్యాలతో నిండిన అనేక ప్రదేశాలు, జంతువులు, నదులు, చెరువులు మొదలైనవి ఉన్నాయి. ఈ రోజు మనం మీకు అలాంటి ఒక గ్రామం గురించి తెలుసుకుందాం. అక్కడ నివసించే ప్రతి మనిషి, జంతువు, పక్షి... అందరూ అంధులే.

Mystery Village: ఆ ఊళ్లో మనుషులు, పశుపక్షాదులు అందరూ అంధులే..! ప్రపంచంలోనే రహస్య గ్రామం..
Mexico Village
Follow us
Surya Kala

| Edited By: Jyothi Gadda

Updated on: May 22, 2022 | 2:18 PM

Mystery Village: ఎవరికైనా కళ్ళు.. ప్రకృతిని అందమైన లోకాన్ని చూపిస్తాయి. కంటి చూపు పోయినట్లయితే  ప్రపంచం మొత్తం అంధకారంగా కనిపిస్తుంది. రంగులేనిదిగా మారుతుంది.  అందుకనే సర్వేంద్రియానాం నయనం ప్రధానం అని అంటారు.  కంటి చూపు జీవితానికి చాలా ముఖ్యమైనది. అయితే ఈరోజు ఒక మిస్టరీ ప్రదేశం గురించి చెప్పబోతున్నాం.. ఇక్కడ నివసించే ప్రతి వ్యక్తి, జంతువు, పక్షి ఇలా అన్నీ అందరూ అంధులే.

మెక్సికోలోని పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలో ‘టిల్టెపాక్’ అనే గ్రామం ఉంది. దాదాపు 300 మంది రెడ్ ఇండియన్లు నివసించే ఈ గ్రామంలో దాదాపు 60 గుడిసెలు ఉన్నాయి. అయితే ఈ గ్రామం విచిత్రం ఏంటంటే ఇక్కడ అందరూ అంధులే. ఇక్కడ మనుషులే కాదు, కుక్కలు, పిల్లులు , ఇతర పెంపుడు జంతువులు కూడా గుడ్డివి. ఇది కొంచెం వింతగా అనిపించవచ్చు, కానీ ఇది వాస్తవం. అయితే ఈ ఊరిలో పుట్టే పిల్లలు పుట్టుకతో అంధులుగా ఉండరు, కానీ వారి కంటి చూపు పూర్తిగా సురక్షితంగా ఉంటుంది.. అయితే కాలక్రమేణా వారు కంటి చూపును కోల్పోతారు.

దీనికి కారణం ఏమిటంటే.. 

మీడియా నివేదికల ప్రకారం..  ఈ గ్రామంలో జాపోటెక్ నాగరికత తెగకు చెందిన ప్రజలు నివసిస్తున్నారు. ఇక్కడున్న వారంతా అంధులు కావడంతో ఇక్కడ ఏ ఒక్క ఇళ్లలోనూ కరెంటు, దీపం లేదు. ఈ గ్రామప్రజలు పగలు, రాత్రి చాలా తేడా లేదు. పక్షుల సందడితో పగలని.. దీంతో వీరు పగలంతా పనికి వెళ్లిపోతారని తెలుస్తుంది. సాయంత్రం, పక్షుల శబ్దాలు ఆగినప్పుడు..ప్రజలు తమ గుడిసెలకు తిరిగి చేరుకుంటారు. ఈ ప్రజలు దట్టమైన అడవుల మధ్య నివసిస్తున్నారు. నాగరికత, అభివృద్ధికి దూరంగా ఉన్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..